Moviesనాగ‌చైత‌న్య‌కు ఆ హీరోయిన్‌తో గొడ‌వ‌… అందుకే వాళ్ల‌కు మాట‌ల్లేవా…!

నాగ‌చైత‌న్య‌కు ఆ హీరోయిన్‌తో గొడ‌వ‌… అందుకే వాళ్ల‌కు మాట‌ల్లేవా…!

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, సమంతతో విడాకులు తర్వాత కెరీర్ పై ఫోకస్ చేస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే చైతు నటించిన చివరి రెండు సినిమాలు ప్రేక్షకుల అంచనాలు అందుకోలేదు. అమీర్ ఖాన్ తో చేసిన సినిమా డిజాస్టర్ అయింది. ఇక థాంక్యూ సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రస్తుతం చైతు నుంచి రెండు, మూడు సినిమాలు వరుసగా రానున్నాయి. ఇక హీరోయిన్ల విషయంలో నాగచైతన్య చాలా సైలెంట్ గా ఉంటాడని పేరు ఉండేది.

అయితే ఎవరు ఊహించని విధంగా తన రెండో సినిమా హీరోయిన్ సమంతతోనే ప్రేమలో పడి.. ఏడు ఎనిమిదేళ్లపాటు.. ఆ ప్రేమను అంతే గప్‌చుప్‌గా నడిపించాడు. అమ్మాయిల విషయంలో చాలా సైలెంట్ గా ఉండే చైతు అసలు సమంతతో ప్రేమలో పడతాడని ఎవరూ ? ఊహించలేదు. వీరి ప్రేమ, పెళ్లి ఎంత షాకింగ్ అయ్యాయో వీరి విడాకులు కూడా అంతే పెద్ద షాక్ ఇచ్చాయి. సమంతకు విడాకులు ఇచ్చేశాక చైతు తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నాడని.. ఆమెను పెళ్లి చేసుకుంటాడని కూడా వార్తలు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఎక్కడో చూసినా వీరిద్దరూ చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నారు.

ఇదిలా ఉంటే చైతుకు తనతో ఓ సినిమాలో కలిసిన నటించిన హీరోయిన్ తో.. షూటింగ్ టైంలో పెద్ద గొడవ జరిగింది. అయితే ఈ విషయం బయటకు రాలేదు నాగర్జున దీనిని సైలెంట్ చేసేందుకు ప్రయత్నించార‌న్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో అప్పుడే వినిపించాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు కాజల్ అగర్వాల్. చైతు, కాజల్ కాంబినేషన్లో దడ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు నాగార్జునతో ఎన్నో సినిమాలు నిర్మించిన కామాక్షి మూవీస్ అధినేత శివప్రసాద్ రెడ్డి నిర్మాత. అజయ్ భూయాన్ దర్శకత్వం వహించారు. దడ సినిమా కొత్తగా ఉన్న ప్రేక్షకుల అంచనాలు అందుకోలేదు. తమిళ్ హీరో శ్రీరామ్, చైతుకు అన్న‌గా నటించాడు.

ఈ సినిమాలో పాటలతో పాటు కథ‌, కథనాలు కొత్తగా ఉంటాయి. అయితే ప్రేక్షకులకు ఆ టేకింగ్ ఎందుకో ఎక్కలేదు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు చైతుకు కాజ‌ల్ మధ్య చిన్న విషయంలో మొదలైన గొడవ చివరకి అది పంతానికి వెళ్లిపోయి… ఇద్దరి మధ్య ఇగో క్లాసెస్ కు దారితీసిందట. ఒకానొక దశలో చైతు చికాకు పడడంతో కాజల్ కూడా షూటింగ్ కు రానని మొండికేసి కూర్చుందట. అప్పుడు నాగార్జున ఈ విషయం బయటకు వస్తే ఇబ్బంది అవుతుందని… నేరుగా రంగంలోకి దిగి సెటిల్ చేశాడని అంటారు. ఆ తర్వాత కాజల్, చైతు కాంబినేషన్లో సినిమా రాలేదు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య మాటలు కూడా లేవని అంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news