Moviesఈ 6 సినిమాల‌ను కాపీ కొట్టి నాని ద‌స‌రా సినిమా తీశారా…...

ఈ 6 సినిమాల‌ను కాపీ కొట్టి నాని ద‌స‌రా సినిమా తీశారా… ఈ సినిమాల లిస్ట్ ఇదే..!

నాని దసరా సినిమా శ్రీరామనవమి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత నాని రేంజ్ కు తగ్గ హిట్ దసరా రూపంలో దక్కిందని నాని అభిమానులు, టాలీవుడ్ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. నానికి జోడిగా కీర్తి సురేష్ నటించింది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. శ్రీకాంత్‌కు ఇదే తొలి సినిమా. దసరా సినిమాలో నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, సముద్రఖని సాయికుమార్, పూర్ణ లాంటి భారీ తారాగణం ఉన్నారు. ఇక సినిమాకు సంతోష్ నారాయణ సంగీతంతో పాటు తోట శ్రీనివాస్ సంభాషణలు హైలెట్గా నిలిచాయి.

సినిమా చూసిన వారంతా దర్శకుడిలో మంచి విషయం ఉందని.. టెక్నికల్ గా కథను తెరమీద ఎలా ?చూపించాలో అలా చూపించే విషయంలో సక్సెస్ అయ్యాడని.. అయితే అదే ఏకాగ్రత క‌థ‌, కథనాల మీద కూడా పెట్టి ఉంటే దసరా రేంజ్ ఖచ్చితంగా మరో లెవల్లో ఉండేదని అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాక్ ట్విస్ట్‌,, సెకండాఫ్ తొలి భాగంలో ట్విస్టులు ఇవ్వడం బాగానే ఉంది.. అయితే క్లైమాక్స్ లో అంతకన్నా పెద్ద ట్విస్ట్ ఇవ్వకపోతే అది ఖచ్చితంగా మంచి సినిమా అనిపించుకోదు.. ఇక దర్శకుడు సినిమా ఫస్ట్ హ‌ఫ్ లో అదిరిపోయే గ్రిప్పింగ్ తో సినిమాను నడిపించి… సెకండాఫ్ లో ఫ్లాట్ నరేష‌న్‌తో వెళ్ళటం కూడా సినిమాకు కాస్త ఇబ్బంది అయింది.

అలాగే ఈ సినిమా చూస్తున్నంత సేపు తెలుగులో గతంలో వచ్చిన ఐదారు సినిమాలను చూస్తున్నట్టు ఉందన్న చర్చలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. రంగస్థలం సినిమాలా కథనాన్ని నడిపించేందుకు ప్రయత్నించడం, పుష్ప సినిమాలోలా కొత్త తరహా మండలికం పలికించాలని ఉత్సాహం, అలాగే కన్నడ డబ్బింగ్ మూవీ కాంతారా సినిమాలా క్లైమాక్స్ ప్లాన్ చేసుకోవడం, ఇక మగధీర సినిమాలోలా 100 మందిని నరుక్కుంటూ రెచ్చిపోయే సీన్లు, ఇక లగాన్ సినిమాలోలా క్రికెట్ టీంని గుర్తుకు తెచ్చే హీరో బలగం, వీటితోపాటు క్లైమాక్స్ లో రుద్రవీణ స్ఫూర్తితో ఒక చిన్న సీన్ ఇవ‌న్నీ మిక్స్ చేసిన‌ట్టుగా ఉందంటున్నారు.

ఇక సిద్ధార్థ, శర్వానంద్ కలిసి తీసిన ఫ్లాప్ సినిమా మహాసముద్రంలో కొన్ని సీన్లు కూడా స్పుర్తిగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. అంటే ఈ సినిమా కోసం హిట్ సినిమాలను మాత్రమే కాదు.. ప్లాప్ సినిమాలను కూడా వదలకుండా దర్శకుడు మిక్స్ చేశాడన్న చర్చలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఏదేమైనా దర్శకుడు ఎన్ని పాత సినిమాలను స్ఫూర్తిగా తీసుకున్నా స్క్రీన్ మీద మ్యాజిక్ చేయడంలో సక్సెస్ అయ్యాడని మొత్తానికి దసరాని హిట్ చేశాడని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news