Moviesబాలయ్య వారి మనోభావాలను దెబ్బతీస్తున్నాడా..? కొత్త ఫిటింగ్ పెట్టింగ్ పెట్టిన తెలుగు...

బాలయ్య వారి మనోభావాలను దెబ్బతీస్తున్నాడా..? కొత్త ఫిటింగ్ పెట్టింగ్ పెట్టిన తెలుగు హీరోలు..!?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా.. నందమూరి బాలయ్యకు ఏ హీరో సాటిరారు అని మరోసారి ప్రూవ్ చేశాడు నందమూరి నటసిం హం బాలయ్య . ఈ వయసులోనూ యంగ్ హీరోలకి ధీటుగా సినిమాలను యాక్సెప్ట్ చేస్తూ.. యాక్సెప్ట్ చేసిన సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తూ.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సినిమా రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు కొత్త బూస్ట్ అప్ ఇస్తున్నారు . పాన్ ఇండియా హీరోలము, గ్లోబల్ హీరోలము అంటూ చెప్పుకునే కొందరు స్టార్ హీరోలు రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకు ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారు .

అదే మన బాలయ్య దగ్గరికి వచ్చేసరికి ఫటా ఫటా అంటూ సినిమాలను ఓకే చేస్తూ.. కమిట్ అయిన సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తూ ..వెంట వెంటనే రిలీజ్ చేసి అభిమానులకు కొత్త బూస్టప్ ఇస్తున్నారు. కాగా ఈ క్రమంలోనే కొందరు టాలీవుడ్ యంగ్ హీరోస్ ఫీలింగ్స్ ను బాలయ్య దెబ్బతీస్తున్నారు అంటూ ఫన్నీగా మీమ్‌స్ ని ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే బడా బడా హీరోలు బోలెడు మంది.

అయితే బాలయ్య లాగా కథ కోసం.. కంటెంట్ కోసం.. న్యాయం కోసం .. పోరాడి సినిమాలను ఎంటర్టైన్మెంట్ గా చూసే హీరోస్ చాలా తక్కువ. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలోకి వస్తున్న హీరోలు అయితే తీసిన కథనే మళ్లీ మళ్లీ తీస్తూ అదే బోరింగ్ కంటెంట్తో ఎంటర్టైన్ చేస్తున్నారే తప్పిస్తే ఎక్కడ ఫ్యాన్స్ కి ఏది కావాలి ఫ్యాన్స్ కి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి అన్న కోణంలో సినిమాలను చూస్ చేసుకోవట్లేదు .

ఆ విషయంలో బాలయ్య నెంబర్ వన్ అని చెప్పాలి . అయితే ఈ క్రమంలోనే కొందరు టాలీవుడ్ హీరోలు బాలయ్య పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది . మరీ ముఖ్యంగా రీసెంట్ కాలంలో వరుసగా సినిమాలు తీస్తూ డిజాస్టర్ సంపాదించుకుంటున్న స్టార్ హీరో బాలయ్య సినిమాల విషయంలో సీరియస్ అవుతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . ఈ క్రమంలోనే బాలయ్య ఎలాంటి డైరెక్టర్స్ తో లైన్ అప్ క్రియేట్ చేసుకుంటున్నారో అదే డైరెక్టర్స్ తో ఈ హీరో కూడా సినిమాలకి కమిట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాడట. దీంతో బాలయ్య తమ మనోభావాలను దెబ్బతీస్తున్నాడు అంటూ మేకర్స్ వద్ద ఈ కుర్ర హీరో చెప్పుకొని విలపిస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది . ఏది ఏమైనా సరే ఓ మనిషి బాగుపడుతుంటే మరో మనిషి చూడలేరు . అది మన తెలుగు ఇండస్ట్రీలో కూడా జరుగుతుంది అంటూ ఈ కుర్ర హీరోలు మరోసారి ప్రూవ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news