Moviesస్పెషల్ రిక్వెస్ట్: "ప్లీజ్..మీకు దండం పెడతాం..దయచేసి..ఆ పని చెయ్యద్దు"..!!

స్పెషల్ రిక్వెస్ట్: “ప్లీజ్..మీకు దండం పెడతాం..దయచేసి..ఆ పని చెయ్యద్దు”..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ బాగా నడుస్తుంది. కొత్త సినిమాలు తీయ్యలేక కొత్త కథలను పుట్టించలేక జనాలను మెప్పించలేక కొందరు డైరెక్టర్లు తమ కెరియర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలను సీక్వెల్ గా అంటూ కథను కంటిన్యూ చేస్తున్నారు . ఈ క్రమంలోనే సినిమాలకు సీక్వెల్స్ తెరపైకి వచ్చి కొన్ని హిట్ కొట్టాయి . కొన్ని ఫ్లాప్ కొట్టాయి .

కాగా ఇదే క్రమంలో సోషల్ మీడియాలో 7/జి బృందావన కాలనీ సినిమాకు సీక్వెల్ రాబోతుంది అంటూ వార్తలు వినిపించాయి . కాగా 7/గ్ బృందావన కాలనీ సినిమా ఎంతటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. రొటీన్ స్టోరీలా కాకుండా ఒక కాలనీలో నాచురల్ గా పుట్టుకొచ్చే టీనేజ్ లవ్ ఇంట్లోని సిచువేషన్స్ బాగా డైరెక్ట్ చేశారు డైరెక్టర్. 2004లో యంగ్ టాలెంటెడ్ హీరో రవి కృష్ణ ..హీరోయిన్ సోనియా అగర్వాల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసింది.

కాగా ఈ మూవీ విడుదలై దాదాపు 19 ఏళ్ళు అవుతుంది . ఇన్నేళ్ల తర్వాత ఈ మూవీకి సీక్వెల్ రాబోతుంది అంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతుంది . అయితే జనాలు మాత్రం ఈ మూవీకి సీక్వెల్ వద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . కొన్ని కొన్ని సినిమాలకు సీక్వెల్స్ బాగోవు అందులో ఒకటే ఈ 7/గ్ బృందావన కాలనీ. ఈ సినిమాను అలాగే వదిలేయండి ఈ క్లాసిక్ హిట్ మూవీకి సీక్వెల్ తీసి చెడగొట్టే ప్రయత్నం చేయొద్దు ..ప్లీజ్ దండం ..పెడతామంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news