Movies"నాకు రాజమౌళిది నాకాలి అని ఉంది"..రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు..!!

“నాకు రాజమౌళిది నాకాలి అని ఉంది”..రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో దర్శకధీరుడు రాజమౌళి పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిన విషయమే . రీసెంట్గా ఆయన తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎంతటి ఘన విజయం అందుకుందో అందరికి తెలిసిందే. అంతేకాదు రీసెంట్గా ఈ సినిమా హాలీవుడ్ లోను రిలీజ్ అయ్యి అక్కడ కూడా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది .

ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలలో రాజమౌళి పేరు మారుమ్రోగి పోతుంది . ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై రాజమౌళి ప్రసంగించారు . పలువురు పెద్దలు ఆయన పై ప్రశంసల వర్షం కురిపించడంతో రాజమౌళి పని తనంపై జనాలు మెచ్చుకుంటున్నారు . కాగా ఇలాంటి టైం లోనే కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకధీరుడు రాజమౌళి పై షాకింగ్ కామెంట్స్ చేశారు .ప్రెసెంట్ అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

“ప్రపంచ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి పై జనాలు పొగడ్తల వర్షం కురిపిస్తుంటే భారతీయ దర్శకులు మాత్రం ఈర్ష్య తో రగిలిపోతున్నారని.. ఈ కోపంతో రాజమౌళిని చంపడానికి కూడా ట్రై చేస్తారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు . ‘మొఘల్ ఈ ఆజాం తీసిన కా ఆసిఫ్ నుంచి.. షోలే తీసిన రమేష్‌ సిప్పీ వరకు అందరినీ నువ్ అధిగమించావ్.. ఆదిత్య చోప్రాలు, కరణ్‌ జోహర్‌లు, భన్సాలి వంటి వారిని దాటేశావ్.. నీ కాలి బొటనవేలుని చీకాలని ఉంది’అని ఆర్జీవి ట్వీట్‌ చేశాడు. దీంతో మరోసారి రాము పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news