Moviesటాలీవుడ్ కుర్ర హీరోలంద‌రూ అనుప‌మ వెన‌కాలే ఎందుకు ప‌డుతున్నారు... ఆమెలో ఏం...

టాలీవుడ్ కుర్ర హీరోలంద‌రూ అనుప‌మ వెన‌కాలే ఎందుకు ప‌డుతున్నారు… ఆమెలో ఏం ఉంది..?

కెరీర్ ప్రారంభంలో హిట్స్ అందుకున్న హీరోయిన్ కొంతకాలం తర్వాత ఫ్లాప్స్ వస్తే దాదాపు పక్కన పెట్టేస్తారు. మళ్ళీ ఆ హీరోయిన్‌ను పట్టించుకునేవారు ఉండరు. అయితే, అనూహ్యంగా కథ డిమాండ్ చేస్తే గతంలో అదే హీరోయిన్ చేసిన సినిమాలు చూసి మళ్ళీ అవకాశం ఇచ్చే దర్శకులు కూడా ఉంటారు. అలా కొంత గ్యాప్ వచ్చినా మళ్ళీ ఓ భారీ హిట్‌తో ట్రెండ్ అయిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.

తెలుగులో అ.ఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనుపమ ఆ తర్వాత శతమానం భవతి సినిమాతో పెద్ద హిట్ అందుకుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా తెరకెక్కిన శతమానం భవతి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో అనుపమ పరమేశ్వరన్ అన్నీ కుటుంబ కథా చిత్రాలలోనే నటించే అవకాశాలను అందుకుంది. అదే ఆ తర్వాత అనుపమకి మైనస్ అయింది. ఇక్కడ ప్రేక్షకులకి అందాల ఆరబోత కావాలి.

ఈ కేటగిరి ప్రేక్షకులు మెజారిటీ భాగం ఉన్నారు. కానీ, ఆ మెజారిటీ భాగం ప్రేక్షకులను అనుపమ తన గ్లామర్ ట్రీట్‌మెంట్‌తో ఆకట్టుకోలేకపోయింది. దాంతో త్వరగానే గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. దీనికి తోడు కరోనా కారణంగా మరికొంత గ్యాప్ వచ్చింది. ఇదే అనుపమకి ప్లస్ అయింది. ప్రొడక్షన్‌లో ఉన్న రెండు సినిమాలు రిలీజై మంచి కమర్షియల్ హిట్స్ సాధించాయి. దిల్ రాజు అన్న కొడుకు నటించిన రౌడీ బాయ్స్, నిఖిల్ సరసన నటించిన కార్తికేయ 2 బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ అందుకున్నాయి.

అంతేకాదు, ఈ రెండు సినిమాలలో అనుపమ అల్ట్రా మోడ్రన్‌గా కనిపించి ఆకట్టుకుంది. కంప్లీట్ డిఫరెంట్ మేకోవర్ యూత్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా అనుపమ హీరోతో చేసిన రొమాన్స్ లిప్ లాక్ ఇప్పుడు వరుస అవకాశాలను తెచ్చిపెడుతున్నాయి. యంగ్ హీరోలందరూ అనుపమతో రొమాన్స్ కోరుకుంటున్నారు. కొత్త సినిమా మొదలు పెట్టేముందు హీరోయిన్‌గా అందరూ అనుపమ పరమేశ్వరన్ పేరునే ప్రస్తావిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news