Moviesబన్నీ సినిమా నే రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. ఇప్పుడు అడుక్కునే...

బన్నీ సినిమా నే రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. ఇప్పుడు అడుక్కునే పరిస్ధితి దాపురించిందిగా..!?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . గంగోత్రి అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు . అంతేకాదు సినిమాకి దాదాపు 100 కోట్ల రెమ్యూనరెషన్ తీసుకుంటున్నట్లు టాక్ వైరల్ గా మారింది . గత ఏడాది డిసెంబర్ 17న పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ ..త్వరలోనే పుష్ప2 సినిమా షూటింగ్లో భాగం కానున్నాడు.

అంతేకాదు పుష్ప 1 కి పుష్ప2 మరింత రేంజ్ లో ఉంటుంది అంటూ మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు . ఈ సినిమాలో హీరోయిన్గా నటించ్చిన రష్మిక మందన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే . రష్మిక మందన్నాపాన్ ఇండియా ప్రజెంట్ లెవెల్ లో క్రేజ్ సంపాదించుకొని బాలీవుడ్ లో ఏకంగా ఏడు సినిమాల్లో నటిస్తుంది . అంతేకాదు పలు బ్రాండెడ్ ఐటమ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కోట్లు సంపాదించుకుంటుంది . అయితే సుకుమార్ పుష్ప కథ రాసుకున్నప్పుడు సినిమాలో కొత్త హీరోయిన్ ని పెడదామని ట్రై చేశాడట .

ఈ క్రమంలోనే అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ అయితే ఈ రోల్ కి చక్కగా అనిపిస్తుందని బోనీ కపూర్ కి స్క్రిప్ట్ చెప్పారట . అయితే కథ విన్న బోనీ కపూర్ మొదటి సినిమాతోనే డీ గ్లామరస్ లుక్ లో జాన్వీ కనిపిస్తే ఆమె ఇమేజ్ డామేజ్ అవుతుందని ..ఈ ప్రాజెక్టు ఆమె చేయదని ముఖాన్ని చెప్పేసాడు . అయితే ఏ మాత్రం నిరుత్సాహ పడని సుకుమార్ వెంటనే రష్మిక ను అప్రోచ్ అవడం ఆమె ఓకే చెప్పడం.. సాయం చేయడం సినిమా తీయడం బ్లాక్ బస్టర్ అవ్వడం చకచకా జరిగిపోయాయి . ఆశ్చర్యం ఏంటంటే రష్మిక గురించి మాట్లాడుకునే వాళ్ళందరూ పుష్ప సినిమా ముందు పుష్ప సినిమా తర్వాత అంటూ చెప్పుకునే స్థాయికి ఎదిగిపోయింది రష్మిక మందన . ఏది ఏమైనా సరే మంచి ఛాన్స్ మిస్ చేసుకుని ఇప్పుడు తెలుగులో అవకాశాల కోసం డైరెక్టర్స్ అని అడుక్కునే పరిస్థితి ఏర్పరచుకునింది జాన్వికపూర్ . దీనంతటికీ కారణం బోనీకపూర్ ఓల్డ్ థింకింగ్ అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news