Moviesఆంటీలనే లైక్ చేస్తున్న మెగా హీరోస్..అప్పుడు చిరంజీవి..ఇప్పుడు పవన్ కల్యాణ్..!!

ఆంటీలనే లైక్ చేస్తున్న మెగా హీరోస్..అప్పుడు చిరంజీవి..ఇప్పుడు పవన్ కల్యాణ్..!!

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా “ఆచార్య”. కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది . అంతేకాదు ఎంతోమంది మెగా ఫ్యాన్స్ కోట్ల ఆశలతో ఈ సినిమా కోసం ఎదురుచూసినా.. ఫైనల్ గా రిజల్ట్ మాత్రం శూన్యంగా మిగిలింది . ఫస్ట్ టైం మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి తెరపై ఎక్కువ స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్న మూవీగా ఆచార్య నిలిచింది.

మెగాస్టార్ చిరంజీవి ..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుంది అంటూ సినిమా ప్రమోషన్స్లో ప్రముఖ హీరోస్ చెప్పుకొచ్చారు . అంతేకాదు ఇటువంటి కంటెంట్ ఉన్న సినిమా ఇప్పటివరకు రాలేదని ఓ రేంజ్ లో హైప్ ఇచ్చారు . ఈ క్రమంలోనే ఆచార్య సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. అయితే ఎవ్వరు ఊహించని విధంగా ఈ సినిమా డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది .

ఈ సినిమాలో సంగీత ఓ పాటలో మెరిసింది . సినిమా ఫ్లాప్ అయినా సరే ఆమె పాట హిట్ అయింది . కాగా ఇప్పుడు అదే స్ట్రాటజీ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాలో వాడుతున్నారట. ఈ మూవీలో సంగీతకు ఓ కీలక రోల్ ఇచ్చారట డైరెక్టర్ క్రిష్. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అయితే అన్నకు ఫ్లాప్ ఇచ్చిన హీరోయిన్ తమ్ముడికి హిట్ ఇస్తుందా..? అంటూ జనాలు భయపడుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతున్న సంగీత.. పవన్ కళ్యాణ్ సినిమాలో ఆఫర్ సంపాదించుకోవడం అంటే మాటలు కాదు . అయితే పవన్ కళ్యాణ్ కి సంగతి ఎలాంటి హిట్ ఇస్తుందా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది..? చూడాలి మరి దీనిపై డైరెక్టర్ క్రిష్ ఏ విధంగా స్పందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news