Moviesఆ సినిమాలో సావిత్రితో ఎన్టీఆర్ శృంగార ర‌సం కేక పెట్టించిందా...!

ఆ సినిమాలో సావిత్రితో ఎన్టీఆర్ శృంగార ర‌సం కేక పెట్టించిందా…!

“ధారుణి రాజ్య‌సంపద మ‌దంబున కోమ‌లి కృష్ణ‌జూచి…“ అంటూ.. భీమ‌సేనుడు త‌న‌ కుడి భుజంపై గ‌ద‌ను పిడికిలి బిగించి తిప్పుతూ.. ప‌ళ్లు బిగించి దుర్యోధ‌నుడిపై (ఎస్వీ రంగారావు) ఉరిమి ఉరిమి చూస్తూ చేసే శ‌ప‌థంగుర్తుందా! ఇది ఇప్ప‌టికీఅనేక మంది మొబైళ్ల‌లో వినిపిస్తూనే ఉంటుంది. అలా సూప‌ర్‌హిట్ కొట్టిన సినిమా పాండ‌వ వ‌న‌వాసం. ఈ చిత్రంలో అన్న‌గారు అప్ప‌టి వ‌ర‌కు వేయ‌ని భీముడి పాత్ర‌ను ధ‌రించారు.

ఈ పాత్ర‌కు ఆయ‌న సంపూర్ణ‌న్యాయం చేశారు. అయితే, అస‌లు అప్ప‌టి వ‌ర‌కు కృష్ణుడు, అర్జ‌నుడు వంటి పాత్ర‌ల్లో మెప్పించిన అన్న‌గారు అనూహ్యంగా భీముడి పాత్ర వేయ‌డం ఏంటి ? ఈ ఆఫ‌ర్ ఎలా వ‌చ్చింది అనేది .. చాలా చిత్ర‌మైన క‌థ‌. మాధవీ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై 1965లో పాండవ వనవాసం చిత్రం తీశారు. అయితే, దీనికి ముందు ‘బభ్రువాహన‌` అనే చిత్రంలో అన్న‌గారు అర్జునుడిగా న‌టించారు. అయితే, సినిమా ఫెయిల్ అయిపోయి అన్న‌గారికి కూడా గుర్తింపు రాలేదు.

దీంతో అన్న‌గారి దృష్టి భీముడి పాత్రపై పడింది. అయితే, అంతకుముందే ఓ చిత్రంలో చిన్న భీముడి పాత్రలో కన్పించిన ఎన్టీఆర్ అహో అనిపించారు. ఈ స్ఫూర్తితోనే అన్న‌గారు భీముడి పాత్ర‌కు రెడీ అయ్యారు. ఇక‌, య‌థాలాపంగా పాండ‌వ వ‌న‌వాసంలోనూ శ్రీకృష్ణుడి పాత్రను ఎన్టీఆరే వేశారు. అయితే, పాండ‌వ వ‌న‌వాసంలో పూర్తి నిడివితో భీముడి పాత్ర‌ను అన్న‌గారు ధ‌రించారు. ద్రౌప‌దిగా.. సావిత్రితో న‌టించే సీన్లు వీర, శృంగార రసాల సమ్మేళనంగా అద్భుతంగా పండించాయి.

భీమసేనుడి పాత్రలో ఎన్టీఆర్ ఒదిగిపోయారు. ద్రౌపదిని నిండు సభలో దుర్యోధనుడు అవ‌మానించిన‌ప్పుడు అన్న‌గారు.. పైన చెప్పుకొన్న ప‌ద్యం(క‌రుణ శ్రీ జంధ్యాల పాప‌య్య‌శాస్త్రిగారు రాసిన‌ది అన్న‌గారు తొలిసారి వినియోగించుకున్నారట‌) “ధారుణి రాజ్య‌సంపద మ‌దంబున కోమ‌లి కృష్ణ‌జూచి…“ అందుకునే స‌రికి.. ఈల‌లు చ‌ప్ప‌ట్ల‌లో హాళ్లు మోగిపోయేవ‌ట‌. ఈ ప‌ద్యం కుదిరితే ఇప్పుడు కూడా వినొచ్చు. అద్భుతంగా ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news