Moviesఆ అమ్మాయిని ప్రేమించి మోసం చేసిన అడ‌వి శేష్‌.. నిజం ఒప్పుకున్నాడుగా...!

ఆ అమ్మాయిని ప్రేమించి మోసం చేసిన అడ‌వి శేష్‌.. నిజం ఒప్పుకున్నాడుగా…!

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ హీరోల్లో అడ‌వి శేష్ ఒక‌రు. తాజాగా హిట్ 2 సినిమాతో మంచి హిట్ కొట్టాడు. దాదాపు 40 ఏళ్ల‌కు చేరువ అవుతున్నా శేష్‌కు ఇంకా పెళ్లి కాలేదు. ఇక హిట్ 2 స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న శేషు తాను ఓ అమ్మాయి ప్రేమ‌లో ఉన్నాన‌ని.. అయితే అది ప్రేమో కాదో అర్థం కాని స్థితిలో ఉన్నాన‌ని.. ఆమెది హైద‌రాబాద్ అని అస‌లు విష‌యం బ‌య‌ట పెట్టాడు. అయితే త‌న‌ది ప్రేమో లేదా ఆక‌ర్ష‌ణో కూడా అర్థం కావ‌డం లేద‌ని శేష్ చెప్ప‌డం ట్విస్ట్‌.

ప్ర‌స్తుతం త‌న లైఫ్‌లో ఆ అమ్మాయి ఉంద‌ని.. అయితే ఆమెను ప్రేమించే స‌మ‌యం మాత్రం లేద‌ని.. త‌న మైండ్ సెట్‌కు ఆమెకు టైం ఇచ్చేంత స్పేస్ లేద‌ని చెప్పాడు. నాకు గ‌ర్ల్ ఫ్రెండ్ ఉందా ? లేదా ? అన్న‌ది కూడా తాను చెప్ప‌లేక‌పోతున్నా అని.. ఇంకా చెప్పాలంటే నేను బోర్డర్‌లో ఉన్నాన‌ని.. తాను ప్రేమ‌లో ప‌డ‌క‌పోవ‌డానికి ఓ కార‌ణం కూడా ఉంద‌ని.. త‌న‌కు మ‌రో వ్య‌క్తికి టైం ఇచ్చేంత స్పేస్ లేదు.. నా కుటుంబానికి కూడా టైమ్ ఇవ్వ‌లేను.. అలాగే ఫ్రెండ్స్‌కు కూడా టైమ్ ఇవ్వ‌లేనని అన్నాడు.

ఎప్పుడూ సినిమాల గురించే తాను ఆలోచిస్తూ ఉంటాన‌ని.. ఇలాంటి టైంలో త‌న జీవితంలో ఓ అమ్మాయికి స్పేస్ ఇవ్వ‌గ‌ల‌నా ? లేదా ? అన్న అనుమానం ఉండ‌డంతోనే తాను బోర్డ‌ర్‌లో ఉన్నాన‌ని చెప్పాడు. ఏదేమైనా అడ‌వి శేష్ త‌న ప్రేమ విష‌యం ఇలా ప‌రోక్షంగా బ‌య‌ట పెట్టాడు. అయితే ఇక్క‌డే తాను ప్రేమించిన అమ్మాయి విష‌యంలో తాను క‌న్‌ఫ్యూజ్‌లో ఉంటూ ఆమెను మోసం చేస్తున్నాడా ? అని కొంద‌రు నెటిజ‌న్లు శేష్‌ను ప్ర‌శ్నిస్తున్నారు.

తాను సినిమాల‌తో ఇంత బిజీగా ఉండ‌డం వ‌ల్లే ఆమెకు క‌నీసం ఐల‌వ్ యూ కూడా చెప్ప‌లేక‌పోయాన‌న్నాడు. శేష్ ఆమెను ప్రేమిస్తున్నాడో లేదో తెలియ‌దు.. కానీ ఆమె అంటే ఇష్టంతో ఉన్నాడు. మ‌రి ఆమె కూడా శేష్ అంటే ఇష్టంతో ఉన్న‌ప్పుడు.. ఆమెకు టైం ఇవ్వ‌క‌పోవ‌డం అంటే ఆమెను మోసం చేయ‌డ‌మే క‌దా ? అన్న‌దే నెటిజ‌న్ల ప్ర‌శ్న‌.

ఏదేమైనా వ‌య‌స్సు ముదిరిపోతుండ‌డంతో శేష్ పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయితే బాగుంటుంద‌నే శేష్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక శేష్ చేతిలో హిట్ -2 త‌ర్వాత మ‌రో మూడు సినిమాలు ఉన్నాయి. గూడఛారి-2 సినిమా ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉందని, అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్లో మరో సినిమా.. మ‌రో సినిమా డిస్క‌స‌న్ స్టేజ్‌లో ఉంద‌న్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news