Moviesఅలీ అల్లుడి బ్యాక్‌గ్రౌండ్ తెలుసా.. ఎన్ని కోట్లు కట్నం ఇచ్చారంటే.. హీరో...

అలీ అల్లుడి బ్యాక్‌గ్రౌండ్ తెలుసా.. ఎన్ని కోట్లు కట్నం ఇచ్చారంటే.. హీరో లు కూడా వేస్ట్..!?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో నటిస్తూ కోట్లాదిమంది ప్రజల మనసులు సంపాదించుకున్న ఈయన .. సినిమాల్లో కమెడియన్గా ..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన స్టైల్ లో నటించి మెప్పిస్తున్నాడు. కాగా దీంతోపాటు ఈటీవీలో ఆలీతో సరదాగా అనే గేమ్ షో ను హోస్టు చేస్తున్నాడు. అంతేకాకుండా అలీ భార్య జుబేద సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని తనలోని టాలెంట్ను బయటపడుతుంది . కాగా రీసెంట్గా వీళ్ళ పెద్ద కూతురు ఫాతిమా వివాహం హైదరాబాదులో అంగరంగ వైభవంగా జరిగింది.

మొదటి నుంచి తన కూతురు పెళ్లి విషయాలను యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ అభిమానులకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఇస్తున్న జుబేదా పెళ్లికి సంబంధించిన ప్రతి పనులను దగ్గరుండి చూసుకునింది. అంతేకాదు అలీ సైతం ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తూ కూతురు పెళ్లిని గ్రాండ్గా జరిపించారు . పెళ్లికి చిరంజీవి – నాగార్జున దంపతులు రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది . అంతేకాదు సీనియర్ బ్యూటీ రోజా సైతం అలీ కూతురు పెళ్లికి వచ్చి సందడి చేసింది. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండీగా మారుతూనే ఉన్నాయి.

కాగా రీసెంట్గా అలీ కూతురు రిసెప్షన్ గ్రాండ్గా జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం హాజరయ్యారు. ఆయనతో పాటు కొంతమంది వైసిపి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు . కాగా ఈ క్రమంలోనే పెళ్లి అరేంజ్మెంట్స్ చూసిన జనాలు కట్నం గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు . అందుతున్న సమాచారం అల్లుడికి అలీ బాగానే ముట్టచెప్పారట. ఫాతిమా డాక్టర్ చదువుకుంది . ఈ క్రమంలోనే అల్లుడు కూడా డాక్టర్ అయి ఉండాలని ఏరి కోరి అతగాడిని సెలెక్ట్ చేసుకున్నాడట ఆలీ .

అంతేకాదు ఫాతిమా అత్తమామలు వెల్ ఎడ్యుకేటెడ్ ..అన్న వదినలు కూడా బాగా చదువుకున్నారు. ఫాతిమా భర్త వదిన కూడా పెద్ద డాక్టర్. ప్రస్తుతం వీళ్ళందరూ లండన్ లో సెటిలై ఉన్నారు. పేరుకు గుంటూరు నగరానికి చెందిన వారైనా ప్రజెంట్ అందరూ లండన్ లోనే సెటిలైపోయి ఉన్నత విద్యావంతులుగా జీవిస్తున్నారు . ఈ క్రమంలోని కూతురుకు మంచి పొజిషన్లో ఉన్నభర్తని తెచ్చాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి . అంతేకాదు పెళ్లి కోసం ఆలీ కోట్లు ఖర్చు చేశాడు అని అంటూ వైరల్గా మారింది. తాను ఇండస్ట్రీకి వచ్చి నప్పటి నుండి సంపాదించుకున్నదంతా ఫాతిమా కి కట్నంగా అలీ ఇచ్చేసాడని ఓ న్యూస్ తెగ హల్చల్ చేస్తుంది . ఏది ఏమైనా సరే అలీ ఎంత కట్నం ఇచ్చిన సరే బంగారం లాంటి అల్లుడు దొరికారు అంటూ జనాలు కామెంట్స్ పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news