Moviesఅప్పుడు రమ్య కృష్ణ..ఇప్పుడు అలియా భట్..అదే తప్పు చేస్తున్నారుగా..!?

అప్పుడు రమ్య కృష్ణ..ఇప్పుడు అలియా భట్..అదే తప్పు చేస్తున్నారుగా..!?

ప్రతి ఆడపిల్లకి తల్లి అవ్వడం ఓ వరం. అమ్మ అని పిలిపించుకోవడానికి ప్రతి అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది. జీవితంలో ఆ సమయం వచ్చినప్పుడు ఎంతో ఆనందిస్తుంది. అయితే తల్లి అవ్వడం అంత ఈజీ మేటర్ కాదు. మరీ ముఖ్యంగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న ఆమెతోపాటు ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా ప్రమాదమే. అయితే ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ అలాంటి జాగ్రత్తలు ఏవి తీసుకోవడం లేదు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే పబ్లిక్ గానే చెప్పేసుకుంటూ భారీ వర్కౌట్స్ చేస్తున్నారు.

కొందరు హీరోయిన్స్ అయితే సినిమాలో షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు . ఆ లిస్ట్ లోకి వస్తుంది ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రజెంట్ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. మనకు తెలిసిందే రమ్యకృష్ణ ఎన్టీఆర్ తో కలిసి నా అల్లుడు అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో వీళ్ళిద్దరి కాంబోలో సయ్యాసయ్యారే అనే సాంగ్ హైలెట్గా నిలిచింది. అయితే రీసెంట్ గా ఈ సాంగ్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ని ఓ డాన్స్ షోలో అభిమానులతో పంచుకున్నింది రమ్యకృష్ణ. ఈ సాంగ్ చేస్తున్న టైంలో తాను నాలుగు నెలల గర్భవతిని అంటూ చెప్పి షాక్ ఇచ్చింది. ఆ టైంలో నేను చాలా జాగ్రత్తగా ఉన్నానని అయినా కానీ ఫుల్ మాస్ స్టెప్స్ మాస్ బిట్స్ చూస్తుంటే ఆపుకోలేక నేను కూడా ఎగిరి డాన్స్ వేసానని చెప్పుకోచ్చింది.

ఈ విషయం తెలుసుకున్న రమ్యకృష్ణ అభిమానులు షాక్ అయిపోతున్నారు. నాలుగు నెలల గర్భవతి ఆ రేంజ్ లో డాన్స్ చేస్తే పొరపాటున ఏదైనా జరగరానిది జరిగుంటే నీ బిడ్డ నీకు దక్కేవాడు కాదు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు అదే లిస్టులోకి యాడ్ అయింది బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియా భట్. మనకు తెలిసిందే అలియా భట్ ఏప్రిల్ లో తన ప్రేమించిన అబ్బాయి బాలీవుడ్ స్టార్ హీరో ని పెళ్లి చేసుకున్నింది. అయితే పెళ్లి చేసుకున్న రెండు నెలలకే మూడో నెల అంటూ అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె శ్రీమంతం వేడుకలు గ్రాండ్గా జరిపారు ఫ్యామిలీ. మనకు తెలిసిందే అలియా భట్ ప్రెగ్నెంట్ అని తెలిసిన కానీ సినిమా షూటింగ్లకు ఏమాత్రం బ్రేక్ వేయలేదు. తను నటించిన సినిమా షూటింగ్లో రిస్కీ షాట్స్ చేసి కొండలు ఎక్కి డేంజరస్ టాస్కులు కూడా చేసింది. దీంతో ఒకప్పుడు రమ్యకృష్ణ చేసిన తప్పే ఇప్పుడు అలియా భట్ చేసింది అంటూ ఓ న్యూస్ ఫైనల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news