Moviesసామ్ కోసం విడాకులు తీసుకున్న ..ఇప్పటికి ఆ పని చేస్తున్న నాగ...

సామ్ కోసం విడాకులు తీసుకున్న ..ఇప్పటికి ఆ పని చేస్తున్న నాగ చైతన్య..!?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని వన్ అఫ్ ది క్యూటెస్ట్ రొమాంటిక్ కపుల్ గా పేరు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సమంత హీరో అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ కలిసి మొదటిగా చేసిన చిత్రం “ఏ మాయ చేసావే “. ఈ సినిమా షూటింగ్ టైంలోనే వీరిద్దరు మనసులు కలిసాయి. ఆ తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారి ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి వరకు తీసుకెళ్లారు. పిల్లలు ఇష్టపడ్డాక పెద్దలది ఏముంది అనుకున్నారో ఏమో నాగార్జున- సమంత వాళ్ళ నాన్నగారు ఇద్దరు పెళ్లికి యాక్సెప్ట్ చేసి గోవాలో గ్రాండ్ గా వెడ్డింగ్ జరిపించారు.

ఇక పెళ్లి తర్వాతే ఈ జంట ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఎంజాయ్ చేసిన ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా అక్కినేని ఫ్యాన్స్ తో పంచుకున్నారు . ఈ ఫోటోలు చూసిన వారందరూ నాగచైతన్య సమంతలది రియల్ లవ్ అని జన్మజన్మలకు విడదీయరాని ప్రేమ బంధం అంటూ ఓ రేంజ్ లో క్యాప్షన్స్ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే కరెక్ట్ గా పెళ్లి చేసుకున్న నాలుగేళ్లకి ఇంకొక మూడు రోజులు ఉంది అనగానే డివర్స్ అంటూ విడాకులు ప్రకటించి అభిమానుల గుండ బద్దలు కొట్టారు. ఇప్పటికి వీళ్ళు ఎందుకు విడాకులు తీసుకోవడానికి రీజన్ అయితే బయటకు రాలేదు. కానీ సోషల్ మీడియాలో ఉన్నవి లేనిపోనివి మాత్రం వైరల్ గా మారుతున్నాయి.

అయితే విడాకులు తీసుకున్న తర్వాత సమంత-నాగచైతన్య పైన లేనిపోని నిందలు వేసింది. కానీ నాగచైతన్య మాత్రం సమంతను ఒక్క మాట కూడా అనలేదు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగచైతన్య..” విడాకులు తీసుకున్న ఇద్దరం హ్యాపీగా ఉన్నాం ..తను హ్యాపీ.. నేను హ్యాపీ” అంటూ కామెంట్ చేశారు. తప్పిస్తే సమంత లాగా ఎప్పుడు మాట్లాడలేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో మరో న్యూస్ వైరల్ గా మారింది. విడిపోయిన తర్వాత కూడా నాగచైతన్య సమంత కోసం తనకి ఇష్టమైన పనులు చేస్తున్నాడని తెలుస్తుంది .

అంతేకాదు సమంతకి చెట్లు అంటే ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. సమంతకి చెట్లు గ్రీనరీ నేచర్ అంటే చాలా ఇష్టం . సమంత నాగచైతన్య కలిసి ఉన్నప్పుడు కొంచెం సమయం దొరికిన గార్డెనింగ్ చేసేవారట. చెట్లను పెంచుకునే వారట ఈ క్రమంలోని ఇద్దరు విడిపోయిన తర్వాత కూడా ఈ క్రమంలో ఇద్దరు కలిసి ఉన్న టైంలో పెంచుకున్న మొక్కలను నాగచైతన్య భద్రంగా తన దగ్గర దాచుకున్నాడట . ఇప్పటికీ వాటికీ నీరు పోస్తూ చక్కటి కండిషన్లో పెట్టారట చైతన్య. సామ్ వదిలేసిన కానీ చైతన్య ఇంకా ఆమె జ్ఞాపకాలను తనతోనే పెట్టుకొని ఉన్నాడు అంటున్నారు అక్కినేని అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news