Moviesవిడిపోయిన సామ్ గుర్తుగా దాని దాచుకున్న చైతన్య..ముక్కలు ముక్కలు చేసిన సమంత..!?

విడిపోయిన సామ్ గుర్తుగా దాని దాచుకున్న చైతన్య..ముక్కలు ముక్కలు చేసిన సమంత..!?

సినీ ఇండస్ట్రీలో ఎన్ని జంటలు ఉన్నా కానీ మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా పేరు సంపాదించుకున్న జంట అక్కినేని నాగచైతన్య- హీరోయిన్ సమంత. వీరిద్దరి మధ్య బాండింగ్ ఎంత బాగా ఉండిందో ..చూడ చక్కగా అన్యోన్యంగా ఉన్నారో.. ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రియల్ పెయిర్ కాకముందు నుంచి రీల్ పేరుగా కూడా వీళ్లు అభిమానులు మనసులో చెరగని ముద్రను వేసుకున్నారు. ” ఏం మాయ చేసావే” సినిమాతో వీళ్ళిద్దరి మధ్య ఓ సపరేట్ బాండింగ్ ఏర్పడింది. అది కాస్త ఫ్రెండ్షిప్ గా.. ఆ తర్వాత ప్రేమగా మారి.. ఆ తర్వాత భార్యాభర్తలుగా ఆ బంధాన్ని మలుచుకున్నారు.

అయితే తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు ..ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత – నాగచైతన్య.. ఎవరు ఊహించని విధంగా విడాకులు తీసుకొని వేరువేరుగా బ్రతుకుతున్నారు.
మనకు తెలిసిందే గత సంవత్సరం అక్టోబర్ రెండు అంటే సరిగ్గా ఇదే రోజున నాగచైతన్య, సమంత మేం విడాకులు తీసుకోబోతున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేశారు. కానీ ఇప్పటివరకు కూడా ఇద్దరూ అఫీషియల్ గా వాళ్లు విడాకులు తీసుకోవడానికి గల కారణాలను మాత్రం చెప్పలేదు. దీంతో జనాలకు వాళ్లకు నచ్చింది ఊహించుకుంటూ.. కావాల్సింది స్ప్రెడ్ చేసుకుంటున్నారు . అయితే ఈ క్రమంలోనే ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని నేటికీ కరెక్ట్ గా సంవత్సరం కావడంతో ..వీళ్ళకి సంబంధించిన కొన్ని వార్తలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే సమంత నాగచైతన్యను కలిపిన మొదటి సినిమా ఏం మాయ చేసావే సినిమాలో లిప్ కిస్ పెట్టుకున్న పోస్టర్స్ ను వాళ్లు గుర్తుగా తమ ప్రేమకు గుర్తుగా బెడ్ రూంస్ లో ఫ్రేమ్ చేయించుకున్నారని.. అవి వాళ్ళ స్వీట్ మెమోరీస్ గా దాచుకున్నారట. పెళ్లికి ముందే సమంత ఒక కాపీ ,,నాగచైతన్య మరొక కాపీ గుర్తుగా బెడ్రూమ్స్ లో దాచుకున్నారని.. వాళ్ళ ప్రేమ జ్ఞాపకార్థం పెట్టుకున్నారట.

కానీ విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఆ ఫోటోను ముక్కలు ముక్కలుగా చేసేసిందని ..కానీ చైతన్య మాత్రం ఇంకా ఆ ఫోటోని సామ్ గుర్తుగా భద్రంగా దాచుకున్నాడని న్యూస్ సినీ వర్గాలలో తెగ హల్చల్ చేస్తుంది. దీన్ని బట్టి అర్థమయిపోతుంది మొదట విడాకుల కోరుకున్నది ఎవరు? ఎవరు ఈ బంధాన్ని ముక్కలు చేసుకోవడానికి ఇష్టపడ్డారు అని అంటూ అక్కినేని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ జంట విడిపోకుండా ఉంటే బాగుండేది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news