Moviesమహేశ్ కోసం కత్తి లాంటి ఫిగర్ ని పట్టిన రాజమౌళి.....

మహేశ్ కోసం కత్తి లాంటి ఫిగర్ ని పట్టిన రాజమౌళి.. ఏముందిరా బాబు.!!

సినీ ఇండస్ట్రీలో రాజమౌళి లెక్కలు వేరేగా ఉంటాయి . సినిమాలు తెరకెక్కించడం ఒక కోణం.. అయితే తెరకెక్కించిన సినిమాను జనాలలోకి ఎలా తీసుకెళ్లడం అనేది రాజమౌళిని చూసే మనం నేర్చుకోవాలి. ప్రజెంట్ దర్శకులు అందరూ రాజమౌళి నే ఫాలో అవుతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు . ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసే సినిమాలు తీయగలిగే సత్తా ఉన్న ఏకైక డైరెక్టర్ రాజమౌళి అంటూ జనాలు ఓ రేంజ్ లో ఆయన పొగిడేస్తున్నారు.

కాగా రీసెంట్గా ఆర్ఆర్ఆర్ అనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తెరకెక్కించిన రాజమౌళి త్వరలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో మరో ప్రతిష్టాత్మక సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉన్న ఈ సినిమా సంక్రాంతి తరువాత అఫీషియల్ షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. అయితే ఈలోపే సినిమాకు సంబంధించిన మిగతా టెక్నీషియన్స్ నటి నటులను సెలెక్ట్ చేసే పనిలో బిజీ అయ్యాడు రాజమౌళి .

కాగా ఇప్పటివరకు మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా ఎవరైతే బాగుంటారు అని ఆలోచించిన రాజమౌళి ..రీసెంట్గా ముగ్గురు క్రేజీ బ్యూటీ పేర్లను ఆలోచించి ..ఫైనల్ గా ఓ హాట్ బ్యూటీ ను సెలెక్ట్ చేశాడట . బాలీవుడ్ బ్యూటీస్ కరీనాకపూర్ , దీపికా పదుకునే, కత్రినా కైఫ్ ఈ ముగ్గురిలో ఒక్కరిని ఈ మహేష్ బాబు సినిమాలో హీరోయిన్గా పెడదామని ట్రై చేశాడట రాజమౌళి.

కాగా ఫైనల్గా హాట్ బ్యూటీ దీపిక పదుకొనే ఈ సినిమాలో ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది . త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటనను రాజమౌళి అభిమానులకు చెప్పబోతున్నాడట. దీంతో ఒక్కసారిగా మహేష్ బాబు పేరు బాలీవుడ్ లో కూడా మారుమ్రోగిపోతుంది. ఏది ఏమైనా సరే మహేష్ బాబు లాంటి అందగాడి పక్కన కత్తిలాంటి దీపికా అయితేనే బాగుంటుంది అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. మరి చూడాలి తెరపై దీపికా పదుకొనే మహేష్ బాబు జంట రొమాన్స్ ఎలా ఉంటుందో ..అది కూడా రాజమౌళి డైరెక్షన్లో అంటే కెవ్వు కేక అనే చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news