Moviesపూజా బర్తడేకి కాస్ట్లీ గిఫ్ట్.. బుట్టబొమ్మ బుట్టలో పడ్డ స్టార్...

పూజా బర్తడేకి కాస్ట్లీ గిఫ్ట్.. బుట్టబొమ్మ బుట్టలో పడ్డ స్టార్ హీరో..ఏం ఇచ్చాడో తెలిస్తే స్టన్ అవ్వాల్సిందే..!!

నిన్న సోషల్ మీడియా మొత్తం ఓ పేరుతో మారుమ్రోగిపోయింది. హ్యాపీ బర్త డే అంటూ సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు ఆమె అభిమానులు. ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు.. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ని ఓ నువ్వు రేంజ్ లో ఏలేసిన పూజా హెగ్డే. సౌత్ లోనే కాదు నార్త్ లోను బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న పూజా హెగ్డే పుట్టినరోజు . అక్టోబర్ 13 1990లో పూజ జన్మించింది. ఈ క్రమంలోనే పూజ కెరియర్ లోనే ఫస్ట్ టైం బిగ్గెస్ట్ సర్ ప్రైజ్ అందుకుంది.

పూజా హెగ్డే పుట్టినరోజు అంటే ముందుగానే బర్త్ డే ప్రిపరేషన్ జరుగుతాయట . కానీ ఈసారి మాత్రం పూజా హెగ్డే ఏం ప్లాన్ చేసుకోకుండా బిజీ షెడ్యూల్స్ లో బిజీగా అయిపోయిందట. ఈ క్రమంలోనే స్టార్ హీరో వెంకటేష్, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. పూజా హెగ్డే బర్త్డేను సర్ప్రైజ్ గా సెలబ్రేట్ చేసి షాక్ ఇచ్చారట. దీంతో ఈ బిగ్ సర్ప్రైజ్ నా లైఫ్ లో మర్చిపోలేను అంటూ దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది పూజ హెగ్డే . ఈ క్రమంలోనే పూజ కు సల్మాన్ ఖాన్ ఇచ్చిన గిఫ్ట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

Salman Khan And Pooja Hegde Spotted At Mumbai Airport After Shooting For Bhaijaan In Ladakh

మనకు తెలిసిందే ప్రజెంట్ పూజా హెగ్డే ” ‘కిసీ గా భాయ్ కిసీ గా జాన్’ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో వెంకటేష్ ఓ గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ కి గర్ల్ ఫ్రెండ్ గా నటిస్తుంది పూజా హెగ్డే. ఓ విధంగా చెప్పాలంటే వెంకటేష్ కి సిస్టర్ రోల్ పూజ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న పూజ హెగ్డే తన బర్త్డే ను షూటింగ్ స్పాట్లోనే సెలబ్రేట్ చేశారు వెంకటేష్, సల్మాన్ ఖాన్. పూజా హెగ్డే కోసం కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినట్లు సల్మాన్ ఖాన్ బాలీవుడ్ చెప్పుకొస్తుంది. డైమండ్ బ్రేస్లెట్ పూజ హెగ్డే కు గిఫ్టుగా ఇచ్చాడట ఈ సల్లు బాయ్ . దీంతో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ నడుస్తుంది అన్న పుకార్లకు బలం చేకూర్చారు సల్మాన్ అంటూ బాలీవుడ్ మీడియా చెప్పకువస్తుంది. అంతేకాదు నా లైఫ్ లోనే ఇది మెమొరబుల్ డే అంటూ పూజ హెగ్డే పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పూజ హెగ్డే బర్త్డే ఫొటోస్ ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news