Moviesవిడాకుల తరువాత ఫస్ట్ టైం..నాగార్జున ఇంట్లో సమంత.. ఫోటోలు వైరల్..!?

విడాకుల తరువాత ఫస్ట్ టైం..నాగార్జున ఇంట్లో సమంత.. ఫోటోలు వైరల్..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఏ న్యూస్ అయినా సరే సెకండ్స్ లో వైరల్ అయిపోతుంది. అది ప్రజెంట్ కానీ ఫాస్ట్ కానీ. ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో గత తాలుక జ్ఞాపకాలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. గతంలో ఏ గొడవలు జరిగినా ఏ హీరో హీరోయిన్ మధ్య ఎఫైర్లు నడిచినా.. ఏ డైరెక్టర్ హీరోయిన్ మోసం చేసింది.. ఎవరు ఎవరితో విడాకులు తీసుకున్నారు ..విడాకుల తర్వాత ఎవరు ఎవరితో అఫైర్లు నడిపారు ..”అంటూ ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ట్రోలర్స్ కంటికి అక్కినేని ఫ్యామిలీ చిక్కింది. రీసెంట్ గా అక్కినేని నాగార్జున అఖిల్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు ఈ వీడియోని చూసి పాత వీడియో.. పాత అడ్వర్టైజ్మెంట్ అంటుంటే..కొందరు కాదు కాదు కొత్తగా తీసిన అడ్వర్టైజ్మెంట్ అంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అడ్వర్టైజ్మెంట్ తెగ వైరల్ గా మారింది.
మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి తర్వాత బోలెడన్ని యాడ్స్ లో నటించారు. వాటిల్లో ఒకటి సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సౌత్ ఇండియా తో క్రేజీ ఆఫర్లు మాట్లాడుకుని సమంత నాగచైతన్య అడ్వటైజ్మెంట్లో నటించారు. ఈ జంట ప్రమోషన్స్ తీసుకున్నప్పటి నుంచి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ టాప్ పొజిషన్ కి వచ్చింది .

అయితే విడాకులు తర్వాత ఈ జంట సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ని పట్టించుకోలేదు. కాగా తాజాగా ఒక యాడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అఖిల్ ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతుంటే టక్కున నాగార్జున గర్ల్ ఫ్రెండ్ దగ్గరకా అంటూ అడగడం దానికి సంబంధించిన వివరాలను అఖిల్ చెప్పడం ఈ క్రమంలోనే నాగార్జున చేతిలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్యాగ్ పై సమంత ఫోటో ఉంటుంది. దీంతో ఆ బ్యాగ్ ని చూసి అఖిల్ నీకు కొత్త గర్ల్ ఫ్రెండ్ నా.. అంటే నాగార్జున రేయ్ నాకు ఉండేది ఒక్కతే గర్ల్ ఫ్రెండ్ రా అంటూ ఆ బ్యాగ్ ని అఖిల్ చేతిలో పెట్టి వెళ్లిపోతాడు.

ఈ అడ్వర్టైజ్మెంట్ మీనింగ్ ఎంతమందికి అర్థమైందో తెలియదు కానీ అందరూ ఫోకస్ ఇప్పుడు సమంత పైనే పడింది. నాగార్జున చేతిలో ఉన్న బ్యాక్ పై సమంత ఫోటో ఎందుకు ఉంది ..?విడాకులు తీసుకున్నాక వాళ్లు సమంతను దూరం పెట్టారు కదా..? మళ్లీ ఈ విధంగా దగ్గరకి తీసుకుంటున్నారా..? అంటూ కొందరు ప్రశ్నించగా.. ఇది ఒకప్పటి పాత వీడియో అని కావాలని కొందరు వైరల్ చేస్తున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరి చూడాలి దీనిపై అక్కినేని ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news