Moviesహిట్ కోసం కృతి శెట్టి బోల్డ్ డెసీషన్..డైరెక్టర్స్ కి పండగే !?

హిట్ కోసం కృతి శెట్టి బోల్డ్ డెసీషన్..డైరెక్టర్స్ కి పండగే !?

సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయా లోకం.. ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేం. ఎంతటి పెద్ద స్టార్ హీరో హీరోయిన్లు అయినా ఒక్క ఫ్లాప్ పడగానే జనాలు పట్టించుకోరు. ప్రస్తుతం అదే పొజిషన్లో ఉంది కన్నడ బ్యూటీ కృతి శెట్టి. ఒకప్పుడు అమ్మడు వస్తే మీద పడి పడిపోయి చూసే జనాలు ఇప్పుడు కృతి శెట్టి బయట కనిపించనా పట్టించుకోవడం మానేశారు, దానికి కారణం వరుసగా రెండు ఫ్లాప్ సినిమాలు తన ఖాతాలో వేసుకోవడమే. ఉప్పెన సినిమాతో ఓ రేంజ్ లో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన కృతిశెట్టి ఆ తర్వాత వచ్చిన నాని శ్యామ్ సింగరాయ్ లో కూడా బెడ్ సీన్స చేసి రెచ్చిపోయి పర్ఫామెన్స్ ఇచ్చింది.

ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడంతో ఇక కృతి కి తిరుగు లేదనుకున్నారు. అనుకున్నట్టే నాగార్జున నాగచైతన్య బంగార్రాజు మూవీలో కూడా కృతి పర్ఫామెన్స్ అదరగొట్టింది. నాగ్ పుణ్యమో కృత్తి అందాల ప్రభావమో ..సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వరుసగా హ్యాట్రిక్ హిట్లు తన ఖాతాలో వేసుకుంది. అంతే కృతి కళ్ళు నెత్తికెక్కి రెమ్యూనరేషన్ పెంచేసింది. కాల్ షీట్లు బుక్ చేయాలంటే క్రేజీ కండిషన్స్ పెట్టింది. దీంతో దర్శక నిర్మాతలకు కోపం వచ్చింది. కానీ జనాల్లో అనుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ చేసుకొని ఆమెనే హీరోయిన్ గా తీసుకోక తప్పలేదు.

కానీ టైం ఎప్పుడు మన వైపే ఉండదు కదా. ఇది సినీ ఇండస్ట్రీ ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం. అంతే భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ది వారియర్ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఫస్ట్ టైం కృతిశెట్టి ఫ్లాప్ సినిమా రుచి చూసింది. ఒక సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ సినిమా అయినా హిట్ అవుతుందిలే అన్న ఆశలు పెట్టుకొని నితిన్ తో మాచర్ల నియోజకవర్గం చేసింది . ఈ సినిమా మరింత డిజాస్టర్ గా నిలిచింది. అసలు ఈ సినిమాలో కృతి ఎందుకు చేసిందో ఎవరికీ అర్థం కాలేదు. ఓ బొమ్మలాగా వచ్చింది బొమ్మలాగే అయిపోయింది.. అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. ఈ కారణంగా కృతి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఫ్లాప్ సినిమా పడింది.

కాగా వరుసగా రెండు బ్లాక్ బస్టర్ ఫ్లాప్ సినిమాలు పడటంతో కృతి శెట్టి బోల్డ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది ఇప్పటివరకు దర్శకనిర్మాతలకు క్రేజీ కండిషన్స్ పెట్టిన కృతి శెట్టి ఇకపై డ్రెస్ సెన్స్ విషయంలో అస్సలు లిమిట్స్ పెట్టదల్చుకోవట్లేదట. డైరెక్టర్స్ అడిగితే బికినీ వేసుకోవడానికి కూడా రెడీ అంటుంది. అంతేకాదు రొమాంటిక్ సీన్స్ లో హాట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. గ్లామరస్ ఫీల్డ్ లో టఫ్ కాంపిటీషన్ ఉన్న ఈ ప్రపంచంలో అతి తీసుకున్న బోల్డ్ డెసిషన్ కరెక్ట్ అంటున్నారు సినీ విశ్లేషకులు. కానీ అభిమానులు మాత్రం కృతిని బికినీలో చూడలేం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి కృతి శెట్టి ఏం చేస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news