Moviesఎన్టీఆర్ చెప్పిన‌ట్టుగానే శ్రీదేవి జీవితంలో అదే జ‌రిగింది... ఆ జాత‌కం నిజ‌మైంది..!

ఎన్టీఆర్ చెప్పిన‌ట్టుగానే శ్రీదేవి జీవితంలో అదే జ‌రిగింది… ఆ జాత‌కం నిజ‌మైంది..!

అన్న‌గారు ఎన్టీఆర్‌.. సినీ జీవితంలో అనేక అద్భుతాలు చేశారు. అనేక మందితో క‌లిసి ఆయ‌న తెర‌ను పంచుకున్నారు. వీరిలో ఆలిండియా నెంబ‌ర్ 1 హీరోయిన్‌ శ్రీదేవి కూడా ఒక‌రు. అనేక సినిమాలు చేశారు. చిన్న వ‌య‌సు నుంచి కూడా శ్రీదేవి సినిమాల్లో న‌టించారు. బాల భార‌తం సినిమా నుంచి కూడా అన్న గారితో అనుబంధం ఉంది. ఈ క్ర‌మంలోనే వేట‌గాడు.. త‌దిత‌ర సినిమాల్లో హీరోయిన్‌గా అన్న‌గారి ప‌క్క‌న శ్రీదేవి తెర‌పంచుకున్నారు.

ఇక‌, బ‌డిపంతులు సినిమాలో అన్న‌గారితో చిన్నప్పుడే శ్రీదేవి ప‌నిచేసింది. అయితే.. ఈ క్ర‌మంలోనే అన్న‌గారు.. శ్రీదేవి జాతకం చూపించార‌ని.. సినీ రంగంలో ఒక టాక్ ఉండేది. అప్ప‌ట్లో ద‌ర్శ‌కుడు.. బి. విఠ‌లాచార్య‌.. ప‌లువురికి వారి వారి భ‌విత్యం గురించి చెప్పేవారు. సినీరంగంలో ఇవి కూడా జ‌రిగేవా.. అంటే..జ‌రిగేవి! అల్లూ రామ‌లింగ‌య్య‌.. హోమియో వైద్యానికి సంబంధించి చిట్కాల‌ను .. సినీ ఫీల్డులో ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కొనేవారికి చెప్పేవారు. స్వ‌యంగా ఆయ‌నే మందులు ఇచ్చేవారు.

ఇక‌, డాక్ట‌ర్ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఏకంగా స్టెత‌స్కోప్‌తోనే షూటింగుల‌కు వ‌చ్చేవార‌ట‌. ఇండ‌స్ట్రీలో ఆయ‌న అనేక మందికి వైద్యం చేసిన హిస్ట‌రీ ఉంది. ఇలానే.. విఠ‌లాచార్య కూడా.. త‌న‌కున్న జ్యోతిష్య‌శాస్త్రంపై ప‌ట్టుతో .. ప‌లువురికి జాత‌కాలు చెప్పేవారు. అన్న‌గారు రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని.. ఆయ‌నే చెప్పార‌ట‌. దీనిని చాలా మంది కొట్టిపారేశారు. కానీ, చాన్నాళ్ల‌కు అన్న‌గారు రాజ‌కీయంగా ఎంత ఎదిగారో తెలిసిందే. చివ‌ర‌కు ఆయ‌న తెలుగుదేశం పార్టీ స్థాపించి ముఖ్య‌మంత్రి అయ్యారు.

అయితే.. అన్న‌గారు..త‌న‌కు సంబంధం లేని.. శ్రీదేవి యాక్టింగ్‌కు అబ్బుర ప‌డి.. ఆమె భ‌వితవ్యంపై ప్ర శ్నించారు. వాస్త‌వానికి విఠ‌లాచార్య చాలా త‌క్కువ మందికే జ్యోతిష్యం చెప్పేవారట‌. అన్న‌గారిపై అభిమా నంతో శ్రీదేవి చేతిని చూసిన‌.. ఆయ‌న‌.. “ఈమె ఈ దేశానికే హీరోయిన్ అయ్యేలా ఉందే“ అని వ్యాఖ్యానిం చార‌ట‌. ఆ త‌ర్వాత‌.. ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. ఏదేమైనా.. అన్న‌గారు చూపించిన జ్యోతిష్యం నిజ‌మైంద‌ని.. శ్రీదేవి ఒక‌టి రెండు సంద‌ర్భాల్లో ప్ర‌స్తావించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news