Moviesమరో ఊరమాస్ సాంగ్ లో సమంత..ఈసారి ఏం ఊపుతుందో..?

మరో ఊరమాస్ సాంగ్ లో సమంత..ఈసారి ఏం ఊపుతుందో..?

యస్.. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ వార్త నిజమే అని తెలుస్తుంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత మరో మాస్ సాంగ్ చేయబోతుంది అంటూ ఇండస్ట్రీలో ఓ హాట్ న్యూస్ వైరల్ గా మారింది. ఇప్పటికే విడాకుల తరువాత సోషల్ మీడియా లొ పిచ్చ యాక్టీవ్ గా ఉంటూ..హాట్ ఫోటో షూట్ లతో పిచ్చెక్కిస్తున్న ఈ బ్యూటీ..మొన్న ఆ మధ్య “ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావ”..అంటూ కుర్రాళ్ళకు కైపెక్కించింది.

పాన్ ఇండియా ల్ర్వల్ లో తెరకెక్కిన పుష్ప సినిమాలో అల్లు అర్జున సరసన ఫస్ట్ టైం హాట్ ఐటెం సాంగ్ చేసిన ఈ బ్యూటీ..మాస్ స్టెప్పులతో ఇరగదీసింది. అల్లు అర్జున్ ధస్ పై కూర్చుని వేసిన స్టెప్ కి ధియేటర్స్ లో విజిల్స్ మారుమ్రోగిపోయాయి. ఈ పాట ఫ్యాన్స్ కు పిచ్చి పిచ్చిగా పిచ్చెక్కించింది. ఇప్పటికి ఈ పాట ట్రెండింగ్ లోనె ఉంది. ఏ ఫంక్షన్లకు వెళ్లినా..ఏ ప్రోగ్రామ్ లు జరిగిన ఈ పాటనే వినిపిస్తుంది.

కాగా, ఇప్పుడు మరోసారి సమంత మరో మాస్ సాంగ్ తో కుర్రాళ్ళను అలరించడానికి రాబోతుందట. అందుతున్న సమాచారం ప్రకారం..స్టార్ హీరోయిన్ సమంత మరో ఊరమాస్ సాంగ్ లో చిందులు వేయనుంది. సమంత కెరీర్ లోనే ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న సినిమా యశోద. ఈ సినిమాలోనే సమంత ఓ పాటలో మాస్ లుక్స్ లో కనిపించబోతుందట.

ఈ పాటను చిత్రీకరిస్తున్నారు సినిమా యూనిట్. హైదారబాద్ లో వేసిన ప్రత్యేమైన సెట్ లో ఈ ఊర మాస్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఈ పాటకు మణిశర్మ మ్యూజిక్ మరో పల్స్ పాయింట్ అని చెప్పవచ్చు. అయితే, ఊ అంటావా మావ సాంగ్ లో..సమంత నడుమును తెగ ఊపుతూ స్టెప్పులు వేసింది. మరి ఈ పాటలో ఏం ఊపుతుందో అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news