Moviesబిగ్‌బాస్ సీజ‌న్ 6 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.. క‌ళ్లు చెదిరే కాంబినేష‌న్లు..!

బిగ్‌బాస్ సీజ‌న్ 6 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.. క‌ళ్లు చెదిరే కాంబినేష‌న్లు..!

తెలుగు బుల్లితెర‌పై నెంబ‌ర్ వ‌న్ రియాలిటీ షోగా దూసుకుపోతోంది బిగ్‌బాస్ షో. ఎలాంటి అంచ‌నాలు లేకుండా ఎన్టీఆర్ హోస్ట్‌గా తెలుగులో బిగ్‌బాస్ ఫ‌స్ట్ సీజ‌న్ స్టార్ట్ అయ్యింది. ఎన్టీఆర్ అద్భుత‌మైన హోస్టింగ్‌కు తోడు.. తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు అది ఫ‌స్ట్ బిగ్‌బాస్ సీజ‌న్ కావ‌డంతో… ఆ ఫ్రెష్‌ఫీల్‌ను మ‌నోళ్లు బాగా ఎంజాయ్ చేశారు. దీంతో ఫ‌స్ట్ సీజ‌న్ సూప‌ర్ హిట్ అయ్యింది.

ఇక రెండో సీజ‌న్‌కు నేచుర‌ల్ స్టార్ నాని హోస్ట్‌గా వ‌చ్చాడు. అప్ప‌టి నుంచి త‌ర్వాత మూడు సీజ‌న్ల‌కు కూడా కింగ్ నాగార్జునే హోస్ట్‌గా ఉంటున్నాడు. మ‌ధ్య‌లో ఒకే ఒక్క ఎపిసోడ్‌కు మాత్రం ర‌మ్య‌కృష్ణ హోస్ట్‌గా వ‌చ్చింది. ఈ బిగ్‌బాస్ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో గతేడాది ఓటీటీ ద్వారా కూడా ఈ కాన్సెఫ్ట్‌ను న‌డిపించారు. హాట్‌స్టార్‌లో ఏకంగా 24 గంట‌ల పాటు ర‌న్ అయ్యేలా ఈ షోను న‌డిపించారు.

అయితే ఓటీటీ వెర్ష‌న్‌లో మాత్రం అనుకున్న స్థాయిలో ఈ షో స‌క్సెస్ కాలేదు. ఇదిలా ఉంటే త్వ‌ర‌లోనే బిగ్‌బాస్ సీజ‌న్ 6ను మొద‌లు పెట్ట‌నున్నారు. జూలై లేదా ఆగ‌స్టు నుంచి ఈ షో మొద‌లు కానుంది. ఇక ఇప్ప‌టి నుంచే ఈ షో కోసం కంటెస్టెంట్ల‌ను ఎంపిక చేసే ప్ర‌క్రియ అయితే స్టార్ట్ అయిపోయింది. గ‌త సీజ‌న్ల‌లో ఖ‌చ్చితంగా హౌస్‌లో ఓ కామ‌న్ మ్యాన్ ఉండేలా జాగ్రత్త‌లు తీసుకునేవారు.

అయితే గ‌త సీజ‌న్లో ఆ సంప్ర‌దాయాన్ని ప‌క్క‌న పెట్టేశారు. అయితే 6వ సీజ‌న్‌కు మాత్రం మ‌ళ్లీ కామ‌న్ మ్యాన్ కంటెస్టెంట్‌ను హౌస్‌లోకి పంపుతున్నార‌ట‌. బుల్లితెర‌పై అల‌రిస్తోన్న కొంద‌రు సెల‌బ్రిటీల‌ను కూడా ఈ సారి షోలోకి తీసుకు వ‌స్తున్నార‌ట‌. యాంకర్ వర్షిణి, నటి నవ్యా స్వామి, యాంకర్ దీపిక పిల్లి, యాంకర్ ధన్షు, చిత్రారాయ్, ఆదిలను షో నిర్వాహకులు కాంటాక్ట్ అయ్యి.. వీరిని ఫైన‌లైజ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. వీళ్లంతా షోలో ఉంటే ఖ‌చ్చితంగా షో క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news