Moviesయ‌శ్ నుంచి మ‌హేష్ వ‌ర‌కు మ‌న స్టార్ హీరోల రెమ్యున‌రేష‌న్లు ఇవే..!

య‌శ్ నుంచి మ‌హేష్ వ‌ర‌కు మ‌న స్టార్ హీరోల రెమ్యున‌రేష‌న్లు ఇవే..!

ప్ర‌స్తుతం బాలీవుడ్‌పై సౌత్ సినిమా పెత్త‌నం న‌డుస్తోంది. బాహుబలితో మొద‌లు పెట్టి బాహుబ‌లి 2, కేజీయ‌ఫ్‌, కేజీయ‌ఫ్ 2.. పుష్ప‌, సాహో.. త్రిబుల్ ఆర్ ఇలా ప్ర‌తి సౌత్ సినిమా బాలీవుడ్‌కు షాకుల మీద షాకులు ఇస్తోంది. మ‌రోవైపు సౌత్‌లో మిగిలిన భాషల క‌న్నా తెలుగు సినిమాలు అక్క‌డ బాగా స‌త్తా చాటుతున్నాయి. దీంతో తెలుగు సినిమా మార్కెట్ మామూలుగా పెర‌గ‌డం లేదు. అందుకే విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి మీడియం రేంజ్ హీరోలు సైతం ఇప్పుడు లైగ‌ర్ లాంటి పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్టుల‌తో త‌మ అదృష్టం ప‌రీక్షించుకోబోతున్నారు.

ఓ ప్రాంతీయ భాషా సినిమాలుగా వ‌చ్చిన త్రిబుల్ ఆర్‌, కేజీయ‌ఫ్ 2 అయితే ఏకంగా రు. 1200 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రాబ‌ట్టాయి. బాలీవుడ్ బడా ఖాన్‌ల సినిమాలు వ‌స్తుంట‌నే అక్క‌డ ప్రేక్ష‌కులు ప‌ట్టించుకోవ‌డం లేదు. తాజాగా ర‌ణ్వీర్‌సింగ్ చేసిన సినిమా ఫ‌స్ట్ డే ప్లాప్ టాక్‌తో రు. 5 కోట్ల వ‌సూళ్లు కూడా రాబ‌ట్టుకోలేకపోయింది. సౌత్ హీరోల సినిమాలు ఇప్పుడు వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ వ‌సూళ్లు రాబ‌డుతుండ‌డంతో మ‌న సౌత్ హీరోలు భారీగా రెమ్యున‌రేష‌న్లు పెంచేశారు.

కోలీవుడ్ హీరో విజ‌య్‌కు త‌మిళ్‌, తెలుగు, క‌న్న‌డ‌తో పాటు ఓవ‌ర్సీస్‌, అర‌బ్ కంట్ర‌స్‌లో కూడా మంచి మార్కెట్ ఉంది. అందుకే ఇప్పుడు విజ‌య్ ఒక్కో సినిమాకు రు. 80 – 100 కోట్లు రెమ్యున‌రేష‌న్‌గా తీసుకుంటున్నాడ‌ట‌. విజ‌య్ ఇటీవ‌ల న‌టించిన బీస్ట్ డిజాస్ట‌ర్ అయ్యింది. అయినా కూడా విజ‌య్ – వంశీ పైడిపల్లి డైరెక్ష‌న్‌లో చేస్తోన్న సినిమాకు రు. 100 కోట్ల‌కు పైనే రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్టు టాక్ ?

వ‌లీమై సినిమాతో హిట్ కొట్టిన మ‌రో కోలీవుడ్ క్రేజీ హీరో అజిత్ కూడా త‌న నెక్ట్స్ సినిమాకు రు. 105 కోట్లు తీసుకుంటున్నాడు. అజిత్ ప్ర‌తి సినిమాకు రు. 100 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడు. క‌న్న‌డ హీరో య‌శ్ కేజీయ‌ఫ్‌కు ముందు వ‌ర‌కు రు. 10 కోట్ల రెమ్యున‌రేష‌న్ కూడా తీసుకోలేదు. కేజీయ‌ఫ్‌కు రు. 20 కోట్ల పైనే ముట్టింద‌ని టాక్ ? ఇప్పుడు ఒక్కో సినిమాకు రు. 40 – 50 కోట్లు చార్జ్ చేస్తున్నాడ‌ట‌. క‌న్న‌డ‌లో టాప్ రెమ్యున‌రేష‌న్ తీసుకునే హీరో ఇత‌డే.

మ‌ళ‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ ఒక్కో సినిమాకు రు. 64 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడు. మ‌ళ‌యాళ ఇండ‌స్ట్రీలో ఇది ఏ న‌టుడికి లేని రెమ్యున‌రేష‌న్‌. ఇక బాహుబ‌లి హిట్ త‌ర్వాత ప్ర‌భాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. మ‌నోడు ఒక్కో సినిమాకు రు. 80 – 100 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడు. మారుతి సినిమాకు కూడా నిర్మాత దాన‌య్య 60 రోజుల కాల్షీట్ల‌కే రు. 100 కోట్లు ఆఫ‌ర్ చేసిన‌ట్టు టాక్ ?

ఇక తెలుగులోకి వ‌స్తే మ‌హేష్‌బాబు ఇంత‌కు ముందు ఒక్కో సినిమాకు రు. 50 – 55 కోట్ల మ‌ధ్య‌లో చార్జ్ చేసేవాడు. ఇప్పుడు లాభాల్లో వాటాతో మ‌నోడికి ఏకంగా రు. 70 కోట్ల వ‌ర‌కు ముడుతోంద‌ట‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక్కో సినిమా రెమ్యున‌రేష‌న్ రు. 50 కోట్ల‌కు పైనే ఉంటోంది. పైగా ప‌వ‌న్ ఇచ్చే కాల్షీట్లు చాలా త‌క్కువుగా ఉంటాయి.

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఇంత‌కు ముందు వ‌ర‌కు ఒక్కో సినిమాకు రు. 30 కోట్ల రేంజ్ రెమ్యున‌రేష‌న్ తీసుకునే వాడు. త్రిబుల్ ఆర్‌కు మాత్రం రు. 50 ముట్టింద‌ట‌. ఇప్పుడు పాన్ ఇండియా లెవ‌ల్ సినిమాలు చేస్తున్నా ఒకేసారి రెమ్యున‌రేష‌న్ పెంచేసి నిర్మాత‌ల‌ను ఇబ్బంది పెట్ట‌డం ఇష్టం లేక ఆ సినిమా రేంజ్‌, బ‌డ్జెట్‌ను బ‌ట్టి రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌ట‌. ఓవ‌రాల్‌గా ఎన్టీఆర్ రేంజ్ ఇప్పుడు రు. 40 కోట్ల‌లో ఉందంటున్నారు.

పుష్ప బాలీవుడ్‌లో హిట్ అయ్యాక బ‌న్నీ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు పుష్ప 2కు ఏకంగా హిందీ రైట్స్ త‌న రెమ్యున‌రేష‌న్‌గా తీసుకుంటున్నాడు. ఇక చెర్రీ కూడా త్రిబుల్ ఆర్ త‌ర్వాత రు. 40 కోట్ల రేంజ్‌లో ఉన్నాడ‌ట‌. ర‌వితేజ లాంటి వాళ్లే రు. 15 – 20 కోట్ల రేంజ్‌కు వ‌చ్చేశారు. వ‌రుణ్ తేజ్ కూడా ఇప్పుడు సినిమాకు రు. 10 కోట్ల‌కు త‌గ్గేదేలే అంటున్నాడ‌ట‌. ఏదేమైనా మ‌న సౌత్ హీరోల రెమ్యున‌రేష‌న్లు దేశంలోనే టాప్ లెవ‌ల్లో ఉంటున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news