Moviesవామ్మో..కంగనా కారు ఖరీదు అన్ని కోట్లా..మొదటి భారతీయురాలు ఆమే..!!

వామ్మో..కంగనా కారు ఖరీదు అన్ని కోట్లా..మొదటి భారతీయురాలు ఆమే..!!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్.. కాదు కాదు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ అంటారు అందరు. ఆమె పేరు చెప్పితే భయపడే సినీ హీరోలు..రాజకీయ నాయకులు చాలా మందే ఉన్నారు. కొందరు ఆమె ఎక్కడా వాళ్ళ బండారం భయటపెడుతుందో అని భయపడితే.. మరికొందరు ఆమె నోటికి ఎవ్వరు పోతారు అంటూ కామ్ గా ఉండిపోతారు. కంగానా అంటే ఉన్నది ఉన్నట్లు మొహానే మాట్లాడుతుందనే ఓ పేరు ఉంది.

అందుకే ఆమెను హిందీలో అందరు ఓ ఫైర్ బ్రాండ్ అంటారు. అంతేకాదు అంతకు మంచి నటిగా కూడా పేరు సంపాదించుకున్నారు. ప్రతి సినిమాకి క్యారెక్టర్స్ వేరియేషన్స్ చూయిస్తూ..అప్పటికప్పుడే తనలోని తప్పు ఒప్పులను సరి చేసుకుంటూ.. చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అంతేనా..ఒకానోక టైంలో తన నటనతో స్టార్ హీరోలతో సమానమైన స్థానాన్ని సంపాదించుకుని..హీరోలకి ..మేం ఏం తక్కువ కాము అంటూ ప్రూవ్ చేసింది. పాత్రకి అనుగుణంగా ఆమె చూపే నటనా కౌశల్యాన్ని అభిమానులు ఎంతగానో ఇష్టపడతారు. డైరెక్టర్స్ కూడా ఆమె నటన చూసి ఫిదా అయినవారు ఉన్నారు.


ఎప్పుడు కాంట్రవర్షీయల్ న్యూస్ తో హెడ్ లైన్స్ లో నిలిచే కంగనా..ఇప్పుడు కారు కొన్ని వార్తల్లో నిలిచింది. యస్..ఆమె కొన్న కారు రేతు చూస్తే ఎవ్వరికైన దిమ్మ తిరగాల్సిందే. కంగనా రనౌత్ నలుపు రంగు మెర్సిడెస్ మేబ్యాక్ S680 కారును కొనుకుంది. 5 కోట్ల రూపాయల విలువైన ఈ కారును కొనుగోలు చేసిన మొదటి భారతీయురాలు ఆమే కావడం విశేషం. ధాకడ్ మూవీ ప్రీమియర్ షో సందర్భంగా కొత్తగా కొనుగోలు చేసిన కారుతో తళుక్కున మెరిసింది కంగనా.

ఇది చాలా విలువైన కారు అని తెలుస్తుంది. మే బ్యాక్‌ ఎస్‌680(Mercedes-Maybach S680) కంపెనీకి చెందిన ఈ లగ్జరీ కారు ఇటీవలే ఇండియాలో లాంచ్‌ అయ్యింది. ప్రస్తుతం కంగనా కొనుగోలు చేసిన ఈ కారు వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కొత్త కారుకు కంగన తల్లి పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన కొన్ని ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో కంగనా రెమ్యూనరేషన్ నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news