Moviesతెలుగు మీడియా ముందుకు స‌మంత‌... చైతుతో విడాకుల గురించి ఏం చెపుతుందో...!

తెలుగు మీడియా ముందుకు స‌మంత‌… చైతుతో విడాకుల గురించి ఏం చెపుతుందో…!

టాలీవుడ్‌లో చూడ‌ముచ్చ‌టైన జంట.. మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్‌గా టాక్ ఆఫ్ ద టౌన్ అయిన నాగ‌చైత‌న్య – స‌మంత నాలుగేళ్ల పాటు టోట‌ల్ ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే మోస్ట్ రొమాంటిక్ కఫుల్‌గా పేరు తెచ్చుకున్నారు. అస‌లు ఈ జంట ఏం చేసినా పెద్ద సంచ‌ల‌న‌మే అయ్యేది. సోష‌ల్ మీడియాలోనూ, ఇటు మీడియాలోనూ వీళ్ల అటెన్ష‌న్ ఎక్కువుగా ఉండేది. అలాంటిది వీరి మ‌ధ్య పొరా పొచ్చ‌లు స్టార్ట్ అయిన నాలుగు నెల‌ల‌కే విడాకుల ప్ర‌క‌ట‌న కూడా వచ్చేసింది.

అస‌లు వీరు విడిపోతార‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. కార‌ణాలు ఏవైనా చైతు మాత్రం విడాకుల‌కు ముందు… విడాకుల త‌ర్వాత కూడా సైలెంట్‌గానే ఉంటూ వ‌స్తున్నారు. స‌మంత మాత్రం విడాకుల‌కు ముందు నుంచే హింట్లు ఇస్తూ… ప‌రోక్షంగా చైతును, అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వ‌స్తోంది. సోష‌ల్ మీడియాలో ఏదో రూపంలో ఆమె పంచ్‌లు విసురుతూనే ఉంటోంది.

విడాకుల త‌ర్వాత సామ్ మీడియాకు దూరంగా ఉంటూ వ‌స్తోంది. సోష‌ల్ మీడియాలోనే తాను ఏం చెప్పాల‌నుకుంటోందో అదే చెపుతూ వ‌స్తోంది. పుష్ప‌లో ఐటెం సాంగ్ చేసి మాంచి క్రేజ్ వ‌చ్చినా.. దానిని క్యాష్ చేసుకునేందుకు ఆమె మీడియా ముందుకు రాలేదు. సామ్ మీడియా ముందుకు వ‌చ్చి ఏడు నెల‌లు అవుతోంది. అయితే ఇప్పుడు స‌మంత త్వ‌ర‌లోనే మీడియా ముందుకు రాబోతోంది అన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది.

న‌య‌న‌తార – స‌మంత క‌లిసి న‌టించిన తమిళ చిత్రం కాదువాకుల రెండు కాదల్ తెలుగులో కూడా వ‌స్తోంది. ఈ సినిమాకు న‌య‌న్ ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ డైరెక్ట‌ర్‌. ఏప్రిల్ 28న తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల కోసం స‌మంత తెలుగు, త‌మిళ్ మీడియా ముందుకు రాబోతోంద‌ట‌. చైతుకు విడాకులు ఇచ్చిన‌ప్ప‌టి నుంచి ఇండైరెక్టుగా విడాకుల‌పై మాట్లాడుతోన్న స‌మంత రేప‌టి రోజు మీడియా వాళ్లు డైరెక్టుగా అడిగే ప్ర‌శ్న‌ల‌కు ఏమ‌ని ఆన్స‌ర్లు ఇస్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news