Moviesరష్మిక ఓవర్ యాక్టింగ్..బెండు తీసేసిన దిల్ రాజు..?

రష్మిక ఓవర్ యాక్టింగ్..బెండు తీసేసిన దిల్ రాజు..?

రష్మిక మందన్న..ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా చలామణీ అవుతుంది. ఛలో’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ..మొదటి సినిమానే మంచి హిట్ కొట్టడంతో తెలుగు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి. అందానికి అందం, నటనకు నటనతో ఆకట్టుకుంటూ.. ఇండస్ట్రీలికి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోలతో జతకట్టి..మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది. అంతేనా హిట్ మోజులో వచ్చిన అవకాశాలనంటిని సైన్ చేయకుండా మెల్లగా తన తెలివితేటలతో మంచి మంచి స్టొరీ లైన్ ఉన్న కధలను చూస్ చేసుకుంటూ సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక రష్మిక చేసిన ప్రతి సినిమా హిట్ కావడంతో ‘గోల్డెన్ లెగ్’ అనే ముద్ర కూడా ఉంది. దాంతో దర్శకనిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు.

ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప’ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు. పుష్ప కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషలలో విజయవంతం కావడంతో పాన్ ఇండియా స్థాయిలో రష్మికకు మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం దక్షిణాదిలో స్టార్‌ నాయికల్లో ఒకరిగా ఉన్న కన్నడ బ్యూటీ.. ఇప్పుడీ జోరును ఉత్తరాదిలోనూ కొనసాగించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో పలు బడా మూవీలకు సైన్ చేసి.. అక్కడ తన పాగ వెయ్యడానికి రెడీ గా ఉంది. కాగా, రష్మిక త్వరలోనే కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌తో ఓ సినిమా చేయనుందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.


కానీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి ఆమెను తప్పించిన్నట్లు తెలుస్తుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయాల్సిన కథను మార్చి విజయ్‌తో పాన్ ఇండియన్ సినిమాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. విజయ్ నటిస్తున్న తొలి తె లుగు స్ట్రైట్ సినిమా కావడంతో ఇక్కడ ప్రేక్షకుల్లో ఆసక్తి బాగానే ఉంది.

పాన్ ఇండియా బ్యూటీ రష్మిక అయితే ఈ సినిమా కి బాగా సెట్ అవుతుంది అని భావించిన మేకర్స్ ముందుగా ఈ సినిమాలో ఆమెను హీరోయిన్ గా అనుకున్నారట. కానీ అమ్మడు రెమ్యూనరేషన్ ఎక్కువుగా డిమాండ్ చేయడంతో..ఆమెను తప్పించి ప్రభాస్ బ్యూటీ కృతిసనన్ ను ఫైనల్ చేసిన్నట్లు తెలుస్తుంది. దీనంతటికి కారణం ఆమె దిల్ రాజుని అవమానించదమే కారణం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నెటిజన్స్ రష్మిక ఓవర్ యాక్షన్ కి పర్ ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చాదు దిల్ రాజు అంటూ..కామెంట్స్ చేస్తున్నారు.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news