Moviesప్రభాస్-మారుతి సినిమా..ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే అప్డేట్ వచ్చేసిందోచ్..

ప్రభాస్-మారుతి సినిమా..ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే అప్డేట్ వచ్చేసిందోచ్..

పాన్ ఇండియా హీరో ప్రభాస్..లేటెస్ట్ గా నతించిన మూవీ “రాధేశ్యామ్”. పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద దారుణంగా పడిపోయింది. సినిమాకి నెగిటివ్ టాక్ రావడమే కాకుండా..ప్రభాస్ పై కూడా నెట్టింట విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో కోట్లు ఖర్చు చేసి పరువు పోగొట్టుకున్నట్లైంది. “రాధేశ్యామ్” సినిమా ఎఫెక్ట్ తో మిగతా ప్రభాస్ డైరెక్టర్స్ జాగ్రత్తలు పడుతున్నారు. కానీ ఓ డైరెక్టర్ మాత్రం ఆరు నూరు అయిన నూరు నూట యాభై అయినా ప్రభాస్ తో సినిమా చేసి తీరుతా అంటూ భీష్మించుకుని కూర్చున్నాడు. ఆయనేఅ .. డైరెక్టర్ మారుతి.

భారీ బడ్జెట్ సినిమా లు తెరకెక్కించి..అపజయం ఎరుగని డైరెక్టర్ గా రికార్డ్లు పట్టిన రాజమౌళి ఎలాగో..చిన్న సినిమాలను డైరెక్ట్ చేసి.. జనాలను కడుపుబ్బ నవ్వించడంలో మారుతి అలాగా..ఈ విషయం ఆయన సినిమాలు చూస్తేనే తెలిసిపోతుంది. ఈయన కు ఎప్పటి నుండొ ప్రభాస్ తో సినిమా తీయ్యాలనే కోరిక ఉందట..ఆ కోరిక ఇన్నాళ్లకు నెరవేరబోతున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని నెలలు నుండి డైరెక్టర్ మారుతితో ప్రభాస్ సినిమా అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ న్యూసే ఇప్పుడు నిజమైంది. మే నెల మూడొ వారంలో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారట మేకర్స్.

ఇప్పటికే ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ అనే పేరుని ఫిక్స్ కూడా చేశారట. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ రొమాన్స్ చేస్తున్నాడని..వాళ్లల్లో ఇప్పటికే హీరోయిన్స్‌గాశ్రీలీల, మాళవిక మోహనన్ ఖరారు అయ్యినట్లు టాక్ వినిపిస్తుంది. కాగా..ఇప్పుడు ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే న్యూస్ నెట్టింట లీక్ అయిన రెబల్ అభిమానులకు మతులు పొగొడుతుంది. ఈ సినిమాలో కోసం దాదాపు 7 కోట్లు ఖర్చు చేసి మరీ ఓ ఇంటి సెట్ ను వేశారట. ఈ సినిమా ఎక్కువ భాగం ఆ ఇంట్లోనే జరుగునుందట.

ప్రభాస్ ఈ సినిమాలో అల్లరి బావ గా కనిపిస్తారని..మరదల్లు తో ఆటపట్టించే సీన్స్ బాగుంటాయని .. హార్రర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించనున్నారన టాక్ తెగ హల్ చల్ చేస్తుంది. అంతేకాదు మారుతి ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా చేశారట. ఈ సినిమాను ఆర్ ఆర్ ఆర్‌తో భారీ హిట్ అందుకున్న డివివి దానయ్య నిర్మించనున్నట్లు సినీ వర్గాలు అంటున్నాయి. సినిమా లాంఛనంగా ప్రారంభం అవ్వాగానే.. వెంటనే షూటింగ్ ప్రారంభం కానుందని ..వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి..త్వరలోనే అభిమానుల ముందుకు తీసుకువస్తారట చిత్ర బృందం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news