Moviesకొరటాల కొంప ముంచకు..కొంచెం ఆలోచించుకో..?

కొరటాల కొంప ముంచకు..కొంచెం ఆలోచించుకో..?

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్.. రీసెంట్ గా RRR సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కొర‌టాల శివ సినిమాను ఓకే చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా సినిమాతో పాటు ఆ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో కూడా ఓ సినిమాకు క‌మిట్ అయ్యాడు. ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా అఫీషియల్ ప్రకటన చేసి చాలా రోజులే అవుతుంది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేది ఎపుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ, ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వాలి అంటే ఇంకా టైం పట్టేటట్లు ఉంది.

 

కొర‌టాల శివ ఇప్ప‌టికే NTR 30 సినిమా పై ఫోక‌స్ పెట్టారు. స్క్రిప్ట్ ప‌నిని పూర్తి చేసేసి…సినిమా షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక‌వైపు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆచార్య సినిమా కూడా ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది. దీంతో ఒక వైపు తార‌క్‌.. మ‌రో వైపు కొర‌టాల శివ ఫ్రీ అయ్యారు. దీంతో వారు త‌మ కాంబో మూవీకి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు ఎన్టీఆర్‌, కొర‌టాల శివ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట.

కానీ, పెరుగుతున్న ఎండకి అధికారులు కూడా బయట తిరగద్దు అని హెచ్చరిస్తుండటంతో..సినిమా జూన్ రెండో వారంలో సెట్స్ పైకి వెళ్లనున్నత్లు తెలుస్తుంది. అయితే ఇంత కాలం ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటి అలియా భట్ అని అంతా ఆశలు పెట్టుకున్నారు. అలియా కూడా స్వయంగా తారక్ సినిమాలో నటిస్తున్న అని చెప్పింది. కానీ రీసెంట్ గానే అమ్మడు పెళ్లి చేసుకుని.. ఓ ఇంటిది అయిపోయింది. దీంతో అలియా ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు ఆ ప్లేస్ లోకి కొరటాల నేషనల్ క్రష్ రష్మిక ను ఫిక్స్ చేసిన్నత్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నే కొందరు ఫ్యాన్స్ కొరటాల నిర్ణయం పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తారక్ పక్కన రష్మిక సూట్ అవ్వదు.. వేరే భామ ని ట్రై చెయ్యి అంటూ సజీషన్స్ ఇస్తున్నారు. పైగా రష్మికా టూ ఓవర్..అలాంటి హీరోయిన్ మా తారక్ పక్కన వద్దు అంటూ ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. మరి కొరటాల తన నిర్ణయం పై ఆలో చించుకుంటారో లేదో ..చూడాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news