Moviesఆ స్టార్‌పై కోపంతోనే రాజ‌మౌళి ' ఈగ ' సినిమా చేశాడా......

ఆ స్టార్‌పై కోపంతోనే రాజ‌మౌళి ‘ ఈగ ‘ సినిమా చేశాడా… తెర‌వెన‌క ఏం జ‌రిగిందంటే..!

దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు దేశంలోనే టాప్ డైరెక్ట‌ర్‌. ఈ విష‌యంలో కొంద‌రికి అనుమానాలు ఉంటాయ్‌.. కొంద‌రు చ‌ర్చ‌ల‌కు తావిస్తూ ఉంటారు. క‌మ‌ర్షియ‌ల్ కోణంలో చూస్తే ఇప్ప‌ట్లో రాజ‌మౌళిని ఎదుర్కొనే వారే ఇండియాలో క‌న‌ప‌డ‌డం లేదు. ఓ ప్రాంతీయ భాష అయిన తెలుగు సినిమాను దేశం ఎల్ల‌లు దాటించేసి ప్ర‌పంచ వ్యాప్తంగా చాటిచెప్పిన ఘ‌న‌త ఖ‌చ్చితంగా రాజ‌మౌళికే ద‌క్కుతుంది. అసలు బాహుబ‌లి సినిమాలు, త్రిబుల్ ఆర్ మాత్ర‌మే కాదు.. అంత‌కు ముందు మ‌గ‌ధీర‌, ఈగ సినిమాలు చూసే చాలా మంది రాజ‌మౌళి టాలెంట్‌కు ఫిదా అయిపోయారు.

ఈ రెండు సినిమాలు నార్త్‌లో ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేశాయి. ఈగ అయితే బాలీవుడ్‌లోనూ అంద‌రి నోళ్ల‌లో నాని ప్ర‌తి ఒక్క‌రు రాజ‌మౌళి వైపు చూసేలా చేసింది. అస‌లు ఈ ఈగ సినిమాను రాజ‌మౌళి ఎందుకు తీశారు ? దీని వెన‌క నిజంగా ఇంట్ర‌స్టింగ్ స్టోరీ ఉందా ? అంటే ఆస‌క్తిక‌ర‌మైన గుస‌గుస‌లే ఉన్నాయి. రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో రామ్ చరణ్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా 2009లో రిలీజ్ అయిన సినిమా మ‌గ‌ధీర‌. అస‌లు ఈ సినిమా టాలీవుడ్‌ను షేక్ చేసింది.

మ‌గ‌ధీర సినిమాను భారీ బ‌డ్జెట్‌తో ఎంతో విజ‌న్‌తో రాజ‌మౌళి తీశాడ‌ట‌. అయితే ఈ సినిమాను తెలుగుతో స‌మానంగా లేదా తెలుగులో హిట్ టాక్ వ‌చ్చిన వెంట‌నే త‌మిళ్‌, బాలీవుడ్‌లో కూడా రిలీజ్ చేయాల‌ని నిర్మాత అల్లు అర‌వింద్‌కు ముందే చెప్పార‌ట‌. అలాగే 50 రోజులు, 100 రోజులు సెంట‌ర్ల వివ‌రాలు వెల్ల‌డించ‌కూడ‌ద‌ని.. క‌లెక్ష‌న్లు కూడా బ‌య‌ట‌కు చెప్ప‌వ‌ద్ద‌న్న కండీష‌న్‌తోనే అస‌లు ఈ సినిమా స్టార్ట్ చేశార‌ట రాజ‌మౌళి.

పాన్ ఇండియా లెవ‌ల్లోనే ఈ సినిమా తీశాడు రాజ‌మౌళి. అయితే రాజ‌మౌళి ఆశ‌ల‌ను అర‌వింద్ ప్ర‌ణాళిక లేక అడియాస‌లు చేసేశారు. తెలుగులో హిట్ అయ్యి యేడాదికి కాని త‌మిళ్‌తో పాటు ఇత‌ర భాష‌ల్లో రిలీజ్ చేయ‌లేద‌ట‌. అయితే అప్ప‌టికే ఆ సినిమాను సోష‌ల్ మీడియాలో మిగిలిన భాష‌ల ప్రేక్ష‌కులు చూసేయ‌డంతో పాటు ఆ సినిమా బ‌జ్ పోయింద‌ని.. మ‌ళ్లీ అలాంటి సినిమా తీయ‌డానికి త‌న‌కు బాహుబ‌లితో మ‌రో ప‌దేళ్లు ప‌ట్టింద‌ని రాజ‌మౌళి చెప్పాడు.

అర‌వింద్‌పై రాజ‌మౌళి కోపానికి ఇది ఓ కార‌ణం అయితే.. తాను ముందుగా చెప్పిన‌ట్టుగా మాట త‌ప్పేసి అర‌వింద్ 100 రోజుల సెంట‌ర్ల‌తో పాటు క‌లెక్ష‌న్ల‌ను కూడా ప‌దే ప‌దే ప్ర‌చారం చేసేశార‌ట‌. ఫ్యాన్స్ ఒత్తిడి మేర‌కు అలా చేశాన‌ని అర‌వింద్ చెప్ప‌డం రాజ‌మౌళి కోపానికి కార‌ణ‌మైందంటారు. అలాగే సినిమా రిలీజ్‌కు ముందు వ‌ర‌కు రాజ‌మౌళికి ప్రాధాన్య‌త ఇచ్చారు. ఆ త‌ర్వాత ప్ర‌మోష‌న్ల‌లో ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టార‌న్న ప్ర‌చార‌మూ జ‌రిగింది.

ఈ కోపాన్ని రాజ‌మౌళి అర‌వింద్‌పై కొన్ని ఇంట‌ర్వ్యూల్లోనే వ్య‌క్తం చేశారు. ఆ తర్వాత స్టార్స్ లేకుండా సినిమా తీసి హిట్ కొడ‌తాన‌న్న ఛాలెంజింగ్‌తోనే రాజ‌మౌళి ఈగను పెట్టి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా తీశాడ‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news