Moviesఆ ఇద్ద‌రు హీరోయిన్ల‌తో ఎన్టీఆర్ ఎఫైర్ న‌డిపారా.. ఆ లింక్ ఏంటి...!

ఆ ఇద్ద‌రు హీరోయిన్ల‌తో ఎన్టీఆర్ ఎఫైర్ న‌డిపారా.. ఆ లింక్ ఏంటి…!

ఎన్టీఆర్ సుధీర్ఘ‌కాలం పాటు సినిమా రంగాన్ని ఏలేశారు. తెలుగు సినిమా రంగానికి 1960 నుంచి 1985 వ‌ర‌కు మ‌కుటం లేని మ‌హారాజు ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ కెరీర్‌లో ఎన్నో విజ‌యాలు.. ఎన్నెన్నో సంచ‌ల‌నాలు. పౌరాణికం అయినా.. జాన‌ప‌దం అయినా.. సాంఘీకం అయినా.. చారిత్రకం అయినా కూడా ఆయ‌న న‌ట‌న‌లో ఒదిగిపోయేవారు. ఆ క్యారెక్ట‌ర్‌కు ప్రాణం పోసేవారు. ఎన్టీఆర్ వంద‌ల కొద్ది సినిమాల్లో న‌టించారు. ఆయ‌న త‌న కెరీర్‌లో ఎంతో మంది గొప్ప గొప్ప హీరోయిన్ల‌తో న‌టించారు.

ఆ త‌రం జ‌న‌రేష‌న్ హీరోయిన్లు అయిన జ‌మున – సావిత్రి – కాంచ‌న – జ‌య‌ల‌లిత నుంచి ఆ త‌ర్వాత త‌రం హీరోయిన్లు జ‌య‌ప్ర‌ద – జ‌య‌సుధ – శ్రీదేవి.. ఆ త‌ర్వాత త‌రంలో వాణీ విశ్వ‌నాథ్ లాంటి హీరోయిన్‌తో కూడా ఆయ‌న న‌టించారు. త‌న కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో ఎంతో మంది హీరోయిన్ల‌తో న‌టించినా ఆయ‌న‌కు ఏనాడూ కూడా ఏ హీరోయిన్‌తో ఎఫైర్ ఉంద‌న్న వార్త అయితే రాలేదు. అయితే ఓ ఇద్ద‌రు హీరోయిన్ల విష‌యంలో మాత్రం ఆయ‌నపై ఈ రూమ‌ర్లు వ‌చ్చాయి.

ఆ ఇద్ద‌రు హీరోయిన్లు ఎవ‌రో కాదు ఒక‌రు కృష్ణ కుమారి. ఆమెతో ఎన్టీఆర్ ప్రేమ‌లో ప‌డ్డార‌ని.. ఆమె అంటే ఎంతో ఇష్టంగా ఉండేవార‌న్న ప్ర‌చారం అప్ప‌ట్లో జ‌రిగింది. ఒకానొక టైంలో ఆమెను పెళ్లి కూడా చేసుకోవాల‌ని అనుకున్నారంటూ మ‌ద్రాస్ ప‌త్రిక‌లు అప్ప‌ట్లో నానా రాద్దాంతం చేశాయి. ఇక ఎన్టీఆర్‌పై రూమ‌ర్లు వ‌చ్చిన మ‌రో హీరోయిన్ వైజ‌యంతీ మాల‌. ఆమెతో కూడా ఎన్టీఆర్ స‌ఖ్య‌త‌తో ఉండేవార‌ని.. అప్ప‌ట్లో ఓ గుస‌గుస పెద్ద ఎత్తున వినిపించింది.

అయితే ఈ వార్త‌ల‌ను అటు ఎన్టీఆర్ కాని.. ఇటు ఆమె కాని ఖండించ లేదు. అయితే వైజ‌యంతీ మాలకు తొలి అవ‌కాశం ఎన్టీఆరే క‌ల్పించార‌నేది వాస్త‌వం. కానీ ఎఫైర్ ఉండేంత చ‌నువు వీరి మ‌ధ్య ఉందా ? అది నిజ‌మేనా ? అన్న‌ది నిరూప‌ణ లేదు. అయితే ఈ టాక్ మాత్రం చాలా యేళ్లు న‌డిచింది. ఈ వార్త‌లు వ‌చ్చే టైంకే ఎన్టీఆర్‌కు పెళ్ల‌య్యి న‌లుగురు పిల్ల‌లు కూడా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news