Moviesబాల‌య్యా ఇంత అల్ల‌రోడివేంద‌య్యా.. ప్ర‌గ్యాను ఎంత భ‌య‌పెట్టేశావ్ (వైర‌ల్ వీడియో)

బాల‌య్యా ఇంత అల్ల‌రోడివేంద‌య్యా.. ప్ర‌గ్యాను ఎంత భ‌య‌పెట్టేశావ్ (వైర‌ల్ వీడియో)

నంద‌మూరి నట సింహం బాలయ్య త‌న వృత్తిప‌ర‌మైన విష‌యాల్లో ఎంత సీరియ‌స్‌గా ఉంటారో ? మామూలుగా అంతే జోవియ‌ల్‌గా ఉంటారు. బాల‌య్య గురించి తెలియ‌ని వాళ్లు.. ఆయ‌న్ను ద‌గ్గ‌ర‌గా చూడ‌ని వారు మాత్రం.. బాల‌య్య‌కు కోపం అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయ‌న నిజ‌మైన మ‌న‌స్తత్వం తెలిసిన వాళ్లు మాత్రం బాల‌య్య‌ను ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు.

బాల‌య్య సినిమాల్లో ఎంత సీరియ‌స్ క్యారెక్ట‌ర్లు వేస్తారో ? ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌లా గౌర‌విస్తారో ? సెట్స్‌లో త‌న‌తో పాటు వ‌ర్క్ చేసేవారిని ఒక్కోసారి అంతే స‌ర‌దాగా ఆట‌పట్టిస్తూ ఉంటారు. ఓ సారి ల‌య‌న్ సినిమా షూటింగ్ టైంలో స‌మీర్ ఫోన్ తీసుకుని స‌మీర్ వాళ్ల ఆవిడ‌కు ఫోన్ చేసి.. మీ ఆయ‌న్ను కిడ్నాప్ చేస్తున్నాం అని చెప్పార‌ట‌. వెంట‌నే వాళ్ల ఆవిడ భ‌య‌ప‌డిపోయింద‌ట‌.. అయితే చివ‌ర‌కు బాల‌య్య ఫోన్ చేశార‌ని తెలిసి ఫుల్ ఖుషీ అయిపోయింద‌ట‌.

ఇక తాజాగా క‌ర్నూలులో అఖండ 100 రోజుల ఫంక్ష‌న్ జ‌రిగింది. బాక్సాఫీస్ వ‌ద్ద సాలిడ్ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన ఈ సినిమా బాల‌య్య కెరీర్‌లోనే తిరుగులేని వ‌సూళ్లు రాబ‌ట్టి నెంబ‌ర్ ప్లేస్‌లో నిలిచింది. క‌ర్నూలు ఎస్టీబీసీ గ్రౌండ్స్‌లో శ‌నివారం సాయంత్రం జ‌రిగిన ఈ స‌భ సూప‌ర్ డూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. ఈ స‌భ కోసం ఈ సినిమా టీం అంతా హైద‌రాబాద్ నుంచి క‌ర్నూలు ఓ స్పెష‌ల్ బ‌స్సులో వెళ్లింది. అయితే బ‌స్సులో బాల‌య్య స‌ర‌దాగా చిలిపి బాలుడిగా మారిపోయాడు.

ఈ ప్ర‌యాణంలో బాల‌య్య అల్ల‌రి చేస్తూ హీరోయిన్ ప్ర‌గ్య జైశ్వాల్‌ను ఆట‌ప‌ట్టించాడు. ఈ వీడియోలో ఆమెను స‌ర‌దాగా భ‌య‌పెట్టిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. బాల‌య్య హీరోయిన్ ప్ర‌గ్యతో ప్ర‌గ్యా ఇప్పుడే బాగా విశ్రాంతి తీసుకో.. మ‌నం ఇప్పుడు వెళ్లేది రాయ‌ల‌సీమ‌… అక్క‌డ జ‌నం అభిమానం త‌ట్టుకోలేవ్‌.. ద‌బిడి దిబిడే అని అన‌డంతో ఆమె ఒక్క‌సారిగా షాక్ అయినా బాగా ఎంజాయ్ చేసింది.

ప్ర‌గ్య ప‌క్క‌నే పూర్ణ కూడా ఉంది. ఇక ద‌ర్శ‌కుడు బోయ‌పాటితో పాటు ఈ సినిమాలో విల‌న్‌గా న‌టించిన శ్రీకాంత్‌, బాబా పాత్ర చేసిన వ్య‌క్తి అంద‌రూ బ‌స్సులో ఉన్నారు. ఓవ‌రాల్‌గా బ‌స్సులో సంద‌డి చేస్తూ ఎంజాయ్ చేస్తూ క‌ర్నూలు ట్రావెల్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

 

 

View this post on Instagram

 

A post shared by Telugu FilmNagar (@telugufilmnagar)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news