Moviesవామ్మో..నరేశ్ కారవ్యాన్‌ అంత కాస్ల్టీ నా..ఇప్పటి వరకు అలాంటిది ఎవ్వరికి లేదట..!!

వామ్మో..నరేశ్ కారవ్యాన్‌ అంత కాస్ల్టీ నా..ఇప్పటి వరకు అలాంటిది ఎవ్వరికి లేదట..!!

ప్రస్తుతం మనం చూస్తున్నట్లైతే హీరో హీరోయిన్లే కాదు ..వాళ్ళకు తండ్రికి తల్లిగా నటించే వారు కూడా రెమ్యూనరేషన్ భారీగానే తీసుకుంటున్నారు. దీంతో సెలబ్రిటీలు బాగా రిచ్ లైఫ్ కు అలవాటు పడుతున్నారు. వాళ్ళు వాడే ప్రతి ఒక్క వస్తువు కాస్ట్లీ గా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇక సినీతారలు సాధారణంగా ఉపయోగించే మల్టీపర్పస్ వాహనం గురించి మనం వినే ఉంటాము. ఇందులో వాళ్ల రేంజ్ కు తగ్గట్లు సకల సౌకర్యాలనూ ఏర్పాటు చేసుకుంటుంటారు ఆయా హీరోలు హీరోయిన్ లు.

అయితే గతంలో ఇది కేవలం స్టార్‌ హీరో, హీరోయిన్లు మాత్రమే ఉపయోగించేవారు .. కానీ, ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టులు కూడా కారవాన్‌లు వాడుతున్నారు. దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు వాళ్ళు పారితోషకాని ఏ రేంజ్ లో తీసుకుంటారో. పెద్ద పెద్ద హీరో హీరోయిన్లు తమ పాత్రకు సంబంధించిన షూట్‌ కంప్లీట్‌ అయితే చాలు నేరుగా వెళ్లి తమ కారవాన్‌లో రిలాక్స్ అవుతారు. మరో షాట్‌ రెడీ అయితే కానీ బయటకు రారు. ఇప్పటికే ఆల్ మోస్ట్ అందరి హీరోలకు హీరోయిన్లకు స్పెషల్ కార్ బ్యాన్ లు ఉన్నాయి. అయితే తాజాగా సీనియర్‌ నటూడు నరేశ్‌ లగ్జరీ కారవాన్‌ని కొలుగోలు చేశాడు. కొంటే కొన్నారు మాకు ఎందుకు అనుకుంటున్నారా..? ఆయన కొన్నది అలాంటి ఇలాంటి కార్ వ్యాన్ కాదు సూపర్ స్పెషాలిటీ కార్ వ్యాన్. ఇప్పటి వరకు అలాంటి కార్ వ్యాన్ ఏ టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు లేదట.

ఈ కార్ వ్యాన్ ను నరేశ్ ప్రత్యేకించి ముంబై నుండి తెప్పించుకున్నారట. ఆయన టేస్ట్ కు తగ్గట్లు డిజైన్ చేయించుకున్న దీనిలో ఏసీతో పాటు బెడ్‌, మేకప్‌ ప్లేస్‌, జిమ్‌, వెయిటింగ్‌ రూమ్‌, వాష్‌రూమ్ వంటివి ఉన్నాయి. అన్ని సౌకర్యాలతో సిద్ధమైన ఈ వ్యాన్‌ కోసం ఆయన దాదాపు 4కోట్లు ఖర్చు చేసారని తెలుస్తుంది. ఇక ఈ లగ్జరి కార్ వ్యాన్ గురించి ఆయన మాట్లాడుతూ..”నటీనటులకు క్యారవాన్​లు అంటే మరో ఇల్లు లాంటిది. వాళ్ళ జీవితంలో దాదాపు 70 శాతం ఈ వాహనాల్లో గడిచిపోతుంటాయి.

దీంతో నేను కార్ల కోసం ఖర్చుపెట్టే డబ్బు మంచి క్యారవాన్​ కొనుగోలు చేస్తే బాగుంటుందని అనుకున్నా. అలాగే కొనుకున్నా. ప్రస్తుతం మనం ఉంటున్న పరిస్థితుల్లో వేరే వాళ్లు వాడిన క్యారవాన్​లో ఉండటం అంత సేఫ్ కాదు. దీంతో నా అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీనిని కొనుగోలు చేశాను” అని నరేశ్‌ చెప్పుకొచ్చారు. ఇక నరేశ్ ఇన్ని కోట్లు పెట్టి కార్ వ్యాన్ కొన్నారంటే ఆయన సంపాదన ఎంత ఉంటూందో అని ఇండస్ట్రీలో గుసగుసలు మొదలైయాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news