Moviesర‌మాప్ర‌భ కూతుర్ని పెళ్లాడింది టాలీవుడ్ టాప్ హీరోయే.. మీకు తెలుసా..!

ర‌మాప్ర‌భ కూతుర్ని పెళ్లాడింది టాలీవుడ్ టాప్ హీరోయే.. మీకు తెలుసా..!

తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటి అయిన రమాప్రభ ఐదు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. ఆ తరంలో హాస్యనటీమ‌ణులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఆమె హీరోయిన్‌గా… క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా త‌న‌దైన ముద్ర వేశారు. హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకులను ఎంతో అలరించిన‌ రాజబాబు – రమాప్రభ కాంబినేషన్ అంటే అప్పట్లో ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉండేదో తెలిసిందే. వీరిద్దరూ కలిసి పండించే హాస్యం తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేది. అప్పట్లో వీరి కాంబినేషన్‌కు చాలా డిమాండ్ ఉండేది. అలాగే ర‌మ ప్రభ అల్లు రామలింగయ్య, రమణారెడ్డి లాంటి గొప్ప హాస్య నటులతో కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు హృదయాల్లో నిలిచిపోయారు.

అలాగే మరో సీనియర్ కమెడియన్ రేలంగి పక్కన కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్న పాత్రల‌లో కనిపించారు. ఇక రమాప్రభ సినిమాల్లో బిజీ బిజీగా ఉన్న సమయంలోనే సినీ హీరో శరత్ బాబుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 13 సంవత్సరాల పాటు కలిసి జీవించిన వీరిద్దరూ ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఇంకా చెప్పాలంటే శరత్ బాబు కంటే వయసులో ర‌మాప్ర‌భ‌ పెద్దది కావడం విశేషం. షూటింగ్‌లు జరుగుతున్నప్పుడు మాత్రమే బయటికి వచ్చే రమాప్రభ మిగిలిన సమయాల్లో మదనపల్లె దాటి బయటకు రారు. ఆమె చిత్తూరు జిల్లా మదనపల్లి. లో నివాసం ఉంటున్నారు.

గతంలో రమాప్రభ ఓ ఇంటర్వ్యూలో ఎవరికీ తెలియని ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తన అల్లుడు అన్న విషయాన్ని చెప్పారు. ఏడాది వయసు ఉన్నప్పుడు తాను తన అక్క కూతురు విజయ చాముండేశ్వరిని దత్తత తీసుకున్నానని… ఆమెను పెంచి పెద్ద చేయడంతో పాటు పెళ్లి చేశా అని చెప్పారు. తన కుమార్తె విజయ చాముండేశ్వరిని రాజేంద్రప్రసాద్‌కు ఇచ్చి పెళ్లి చేశాను అని ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అయితే ర‌మాప్ర‌భ చెప్పేవ‌ర‌కు ఈ విషయం చాలామందికి తెలియదు. ఇక మా అసోసియేష‌న్ వ‌ల్ల తాను ఎన్నో అవమానాలకు గురయ్యాను అని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మా అసోసియేషన్ వాళ్లు తనకు ఏ రోజు కూడా సముచిత గౌరవం ఇవ్వలేదని… చివరకు తన అల్లుడు రాజేంద్రప్రసాద్ మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా తనకు గౌరవం లేదని వాపోయారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news