Moviesశ్రీజ‌తో విడాకుల రూమ‌ర్ల‌పై క్లారిటీ ఇచ్చిన క‌ళ్యాణ్‌దేవ్‌...!

శ్రీజ‌తో విడాకుల రూమ‌ర్ల‌పై క్లారిటీ ఇచ్చిన క‌ళ్యాణ్‌దేవ్‌…!

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సెలబ్రిటీల విడాకుల విషయాలు బాగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. అటు వెండితెర కావచ్చు… ఇటు బుల్లితెర కావచ్చు పలువురు ప్రముఖులు విడాకుల ప్రకటన చేస్తూ సినీ అభిమానులకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. గత ఐదారు నెలల్లోనే ఎంతో మంది సినీ ప్రముఖులు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు మరికొంతమంది కూడా అదే బాటలో ఉన్నారంటూ వస్తున్న‌ రూమర్లు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. కొద్ది నెలల క్రితమే అక్కినేని హీరో నాగచైతన్య స్టార్ హీరోయిన్ సమంత విడాకులు తీసుకుని తమ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య కోలీవుడ్ హీరో ధనుష్ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి పెద్ద బాంబు పేల్చారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్‌తో విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజుల నుంచి ఈ జంట మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. తాజాగా కళ్యాణ్ నటించిన సూప‌ర్‌మ‌చ్చి సినిమాను అసలు మెగా హీరోలు ఎవరు ప్రమోట్ చేయలేరు. దీనికితోడు శ్రీజ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఐడీలో శ్రీజ కళ్యాణ్ అన్న పదం నుంచి శ్రీజ కొణిదల అని మార్చుకుంది. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న గ్యాప్ నిజమే అంటూ మరిన్ని సందేహాలు తలెత్తుతున్నాయి.

గతంలో స‌మంత నాగ‌ చైతన్యకి విడాకులు ఇచ్చే ముందు కూడా అక్కినేని అన్న పేరును తీసేసింది. ఇప్పుడు కూడా ఇలా చేయడంతో ఈ జంట కూడా విడిపోతున్నారన్న‌ ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు కళ్యాణ్ కొత్త సినిమా ఏమాత్రం ప‌ట్టించుకోని మెగా హీరోలు దిల్ రాజు ఫ్యామిలీ హీరో రౌడీ బాయ్స్ – గల్లా ఫ్యామిలీ హీరో అశోక్ న‌టించిన‌ హీరో సినిమాలను ప్రమోట్ చేశారు. దీంతో రకరకాల సందేహాలు తలెత్తాయి. అయితే ఈ రూమర్లపై శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ ఇండస్ట్రీలోని తన సన్నిహితుల వద్ద రెండు రోజుల క్రితం స్పందించడంతో పాటు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

తాను ఇప్పుడు వివాదాలకు… మీడియాకు దూరంగా ఉంటానని అయితే మీడియా మాత్రం కావాలని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తమ కుటుంబం మధ్య జరిగే వ్యక్తిగత విషయాలను మీడియాకు చెప్పాల్సిన పని లేదు అని కూడా కళ్యాణ్ తన సన్నిహితుల వద్ద వాపోయార‌ట‌. అలాగే సెలబ్రిటీల మనోభావాలతో ఆడుకోవటం మీడియాకు మంచిదికాదని కళ్యాణ్ చెప్పినట్టు తెలుస్తోంది. కళ్యాణ్ ఆవేదన నిజమే అయితే ఈ విడాకుల రూమర్లపై క్లారిటీ ఇచ్చేస్తే వాళ్ళ నోళ్లకు తాళం వేసినట్లు అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news