Gossipsటాలీవుడ్ హాట్ గాసిప్‌... ఆ హీరోయిన్‌తో వ‌రుణ్‌తేజ్ పెళ్లి...!

టాలీవుడ్ హాట్ గాసిప్‌… ఆ హీరోయిన్‌తో వ‌రుణ్‌తేజ్ పెళ్లి…!

టాలీవుడ్‌లో రోజుకో ఇంట్ర‌స్టింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ రోజు ఓ అదిరిపోయే వార్త వైర‌ల్ అవుతోంది. ఇండస్ట్రీకి చెందిన ఓ క్రేజీ హీరో .. మ‌రో హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న‌దే ఆ గాసిప్‌. ఆ హీరో ఎవ‌రో కాదు మెగా ఫ్యామిలీ హీరో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌. వ‌రుణ్ తేజ్ రు. 25 ల‌క్ష‌ల విలువైన డైమండ్ రింగ్‌తో ఈ రోజు బెంగ‌ళూరు వెళ్లాడ‌ని.. అక్క‌డే ఆ హీరోయిన్‌కు ప్ర‌పోజ్ చేయ‌బోతున్నాడ‌న్న వార్త మెగా కాంపౌండ్ వ‌ర్గాల నుంచి ఒక్క‌సారిగా బ‌య‌ట‌కు పొక్కింది.

ఇది ఇప్పుడు బాగా స్ప్రెడ్ అయిపోతోంది. ఇక వైర‌ల్ అవుతోన్న న్యూస్ ప్ర‌కారం వ‌రుణ్ తేజ్ ప్ర‌పోజ్ చేయ‌బోయే ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు లావ‌ణ్య త్రిపాఠి. ఇప్పుడు మీడియా అటెన్ష‌న్ అంతా ఈ గాసిప్ మీదే ఉంది. అయితే ఇది నిజ‌మా ? కాదా ? అన్న‌ది మాత్రం సాయంత్రానికి తేలిపోనుంది. గ‌తంలో వీరిద్ద‌రు మిస్ట‌ర్ లాంటి సినిమాల్లో న‌టించారు. ప్ర‌స్తుతం సినిమాల ప‌రంగా చూస్తే లావ‌ణ్య పెద్ద బిజీ హీరోయిన్ కాదు.

అయితే వ‌రుణ్ లైన‌ప్‌లో మాత్రం చాలా మంచి, క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి. ఇక లావ‌ణ్య – వ‌రుణ్ మ‌ధ్య నిజంగా ప్రేమ ఉంటే ఆమె అదృష్ట‌వంతురాలే అని చెప్పాలి. టాలీవుడ్‌లోనే క్రేజీ ఫ్యామిలీల్లో ఒక‌టి అయిన మెగా ఫ్యామిలీ కోడ‌లిగా అడుగు పెట్ట‌డం అంటే మామూలు ల‌క్కీ కాదు. తెలుగులో లావ‌ణ్య‌కు మంచి అవ‌కాశాలే వ‌చ్చాయి. అయితే స్టార్ హీరోయిన్ మాత్రం కాలేక‌పోయింది. పెద్ద హీరోల సినిమాల్లో ఆమెకు ఛాన్సులు రాలేదు. మ‌రీ ఈ విధంగా ఆమె కెరీర్ సెటిల్ అయిపోతుందేమో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news