Moviesఈ బిగ్ బాస్ బ్యూటి కొన్న లగ్జరీ బైక్ ధర ఎంతో...

ఈ బిగ్ బాస్ బ్యూటి కొన్న లగ్జరీ బైక్ ధర ఎంతో తెలుసా..మామూలు సౌండ్ కాదే..!

తెలుగులోనే అతి పెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ ద్వారా చాలా మంది మనకు తెలియని నటులు..బాగా పాపులర్ అవుతున్నారు. హౌస్ లో ఎన్ని రోజులు ఉన్నారు అన్నదానికంటే హౌస్ లో ఉన్నని రోజులు ఎలా రచ్చ చేసారు అనేది ఇక్కడ ముఖ్యం. నువ్వు హౌస్ మూడు నాలుగు వారలు సైలెంట్ గా ఉన్నా రాని పేరు నీకు ఒక్క వారం లవ్ ట్రాక్ నడిపిన హాట్ ఎక్స్ పోజింగ్ చేసిన ఆ సీజన్ అంతా అది గుర్తుండిపోది. అలాగే బిగ్ బాస్ సీజన్ 5 లోకి ఎటువంటి అంచనాలు లేకుండా వెళ్ళిన లహరి..రవి తో బాత్ రూం లో హగ్ అంటూ తోటి కంటెస్టేంట్ ప్రియ చేసిన కామెంట్స్ ఎంత వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక అలా అందరి నోర్లల్లో నానుతూ వచ్చిన లహరి..హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాక కొన్ని ఆఫర్స్ అందుకుని తన పేరు జనాలకు గుర్తుండేలా చేసుకుంటుంది. ఈ మధ్యనే ఫైట్ లో బంగార్రాజు టీం ను ఇంటర్వ్యు చేసి..తనదైన స్టైల్లో మెప్పించిన లహరి..రీసెంట్ గా ఓ లగ్జరీ బైక్ ను కొనింది. ఎప్పటి నుండో కొనాలై అని ఆశ పడుతూ వచ్చిన లహరికి ఇప్పుడు ఆ టైం వచ్చిన్నట్లు ఉంది. దీంతో ఎంతో సంబరపడిపోయిన లహరి ఆ బైక్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతోపంచుకుంది.

ఇక సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈ అందాల తార తాజాగా ఓ లగ్జరీ బైక్ ను కొనుగోలు చేసినట్లు అభిమానులతో పంచుకుంది. భంవ్ ఘ్ 310 ఘ్శ్ మోడల్‌కి చెందిన బైక్ ని కొన్న లహరి ”మొత్తానికి ఈ బైక్‌ కొన్నాను. చాలా సంతోషంగా ఉంది. నా బైక్‌ సౌండ్‌ చాలా నచ్చింది” అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆనీ మాస్టర్‌ సహా పలువురు లహరికి కంగ్రాట్స్‌ చెబుతూ కామెంట్స​ చేస్తున్నారు. ఇక లహరి కొన్న ఈ లగ్జరీ భంవ్ ఘ్ 310 ఘ్శ్ బైక్ విషయానికి వస్తే ఇది చాలా ట్రెండింగ్ లో ఉన్న బైక్ మోడల్‌ గా తెలుస్తుంది. అంతే కాదు ఈ బైక్‌ ఖరీధు సుమారు రూ.3-3.5లక్షలు ఉంటుందట. దీంతో నెటిజన్స్ అమ్మడు ఒక్క బైక్ కే అన్ని లక్షలు పోసి కొనిందంటే అమ్మడు త్రేంజ్ ఎలాంటిదో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Lahari Shari (@lahari_shari)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news