Moviesఅఖండ సినిమాకి సీక్వెల్‌ వస్తే.. అవన్నీ ఖచ్చితంగా చూపిస్తారట..!!

అఖండ సినిమాకి సీక్వెల్‌ వస్తే.. అవన్నీ ఖచ్చితంగా చూపిస్తారట..!!

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సినిమా “అఖండ”. ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో వీళ్ల కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టింది. వీరి కాంబినేషన్లో వచ్చిన సింహా.. లెజెండ్ రెండు సూపర్ హిట్ అయ్యాయి. ఇక రీసెంట్ గా వచ్చిన అఖండ కూడా హీత్ ఖాఆవాదాంటొ హ్యాట్రిక్ హిట్ కాంబోలో వీళ్లు నిల్చారు. ఇక ఈ సినిమా వ‌సూళ్ల‌ విషయంలో అక్కడ ఇక్కడ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల కూడా బాక్సాఫీస్ ను కుమ్మేస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో అగోరగా కనిపించిన బాలయ్య చెప్పే డైలాగ్స్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి.

ఇక అఖండలో బాలయ్య నట విశ్వరూపం చూపించారు. బాలయ్య ను ఇది వరకు ఎన్నడు చూడని విధంగా చూయించాడు బోయపాటి. దీంతో బాలయ్యకు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బోయపాటిని మరో సినిమా బాలయ్యతో చేయాలనీ అభిమానులు రికెవ్స్ట్ చేస్తున్నారు. అది కూడా అఖండ ఇంకా థియేటర్లో ఉండగానే మరో సినిమా చేయమని బోయపాటిని కోరుతున్నారు అభిమానులు. ఇక ఇదే నేపధ్యంలో ఇప్పుడు అఖండ సినిమాకు సీక్వెల్ రాబోతుందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది.

కాగా, సినిమాలో అహోరగా కనిపించిన బాలయ్య “ఈ జన్మకి శివుడే నాకు తండ్రి. ఆ లోకమాతే నాకు తల్లి” అంటూ అఖండ తన బంధాలన్నింటినీ తెంచేసుకుని వెళ్లిపోతాడుఅంతేకాక ఈ సినిమా చివరిలో తన సోదరుడు కూతురుకి “ఎక్కడ అన్యాయం జరిగిన నేను వస్తా” అంటూ మాట ఇచ్చి ఆయన వెళ్లిపోవడం చూపించారు. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే స్కోప్ ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కవేళ సీక్వెల్ వస్తే దానీలో ఏ అంశాలను చూయిస్తారో కూడా ఓ అంచనా వేస్తున్నారు అభిమానులు.

ఒక్కవేళ అఖండకు సీక్వెల్ వస్తే మాత్రం ఈసారి సినిమాలో 80 % బాలకృష్ణ(అఘోర) నేపథ్యాన్ని చూపించొచ్చు. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ లో పసి బిడ్డగా ఉన్నప్పుడే కాశీకి చేరుతాడు బాలయ్య. మరి అక్కడ ఎలా పెరిగాడు..? ఎవరి దగ్గర పెరిగాడు? ఎలాంటి షటాలు పడ్డారు..? వంటి అంశాలను అఖండ సీక్వెల్​లో చూపించే అవకాసం ఉందంటున్నారు. అలాగే బాలయ్య(అఘోర) కర్తవ్యం పాడు బడిన గుడులను బాగుచేయడం..ఆ ఆలయాలకు మళ్లీ పూర్వవైభవం తీసుకురావడం. మరి ఈ క్రమంలో అతడికి ఏమైనా సమస్యలు ఎదురయ్యాయా? ఇవి కూడా సీక్వెల్​లో చూపించొచ్చని లెక్కలు వేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news