Moviesవావ్: జంట అదుర్స్..బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ఇంట పెళ్లి భాజాలు షురూ..!!

వావ్: జంట అదుర్స్..బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ఇంట పెళ్లి భాజాలు షురూ..!!

తెలుగులో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ఈ మధ్యే ప్రారంభమైన విషయం తెలిసిందే. బిగ్‌బాస్‌ ఏ చిన్న టాస్క్‌ ఇచ్చినా నువ్వానేనా అన్న రీతిలో పర్ఫామ్‌ చేస్తున్నారు. టైటిల్‌ ఎలాగైనా సాధించి తీరాలని కసితో ఆడుతున్నారు. దీంతో టాప్ టీఅర్పి రేటింగ్ లతో దూసుకుపోతుంది బిగ్ బాస్. మొత్తంగా 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ బిగ్ బాస్ రియాలిటీ షోలో ప్రస్తుతం 8 మంది ఉన్నారు. అయితే పోటా పోటీగా సాగుతున్న ఈ బిగ్ బాస్ షోలో 7వ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టేంట్ ప్రైయ గుర్తు ఉన్నారు కదా..

హా మర్చిపోయే పర్ ఫామెన్స్ ఇచ్చిందా ఆమె..గుర్తు ఉండే ఉంటుందిలేండి. బిగ్ బాస్ హౌస్ లో తోటి కంటెస్టేంట్ సన్నీ పై రెచ్చిపోయిన ఈమెను ఆడియన్స్ తక్కువ ఓట్లు వేసి ఇంటినుండి బయటకు పంపేసారు. ఇక బిగ్ బాస్ యాజమాన్యం కూడా ఈమెకు బాగానే పారితోషకం ఇచ్చిన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీ గా ఉంది. తనకు కూతురు వరుసయ్యే అమ్మాయి పెళ్లి జరగనుంది. దీంతో ఆమె పెళ్లి పనులను ప్రియానే దగ్గర ఉండి చూసుకుంటున్నట్లు తెలుస్తుంది.

 

 

View this post on Instagram

 

A post shared by £0{-}!t{-}@👑 (@lohi.79)

రీసెంట్ గా జరిగిన ఈ మ్యారేజ్ కు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు జెస్సీ, ఉమాదేవి, సరయు విచ్చేశారు. పెళ్లి వేడుకల్లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచిన వీరి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ‘మా ఇంట్లో పెళ్లి వేడుకలు షురూ’ అంటూ ఇంటి ముందు ముగ్గులేసిన ఫొటోను ప్రియ ఈ మధ్యే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. హల్దీ, మెహందీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సైతం ఎప్పటికప్పుడు పంచుకుంటూ వస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రియ రెండు సినిమాలకు కూడా సైన్ చేసిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Priya (@priyaartist)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news