ReviewsTL రివ్యూ: దృశ్యం 2

TL రివ్యూ: దృశ్యం 2

న‌టీన‌టులు: వెంక‌టేష్‌, మీనా, త‌నికెళ్ల భ‌ర‌ణి, న‌దియా, న‌రేష్‌, సంప‌త్‌రాజ్‌, కృతిక‌, జ‌య‌కుమార్ త‌దిత‌రులు
మ్యూజిక్‌: అనూప్ రూబెన్స్‌
సినిమాటోగ్ర‌ఫీ: సతీష్ కురూప్
ఎడిటింగ్‌: మార్తాండ్ కె. వెంక‌టేష్‌
నిర్మాత‌లు: డి. సురేశ్ బాబు, అంటోనీ పెరంబవూర్, రాజ్‌కుమార్ సేతుపతి
ద‌ర్శ‌క‌త్వం: జీతూ జోసెఫ్
రిలీజ్ డేట్‌: 25 న‌వంబ‌ర్‌, 2021

సీనియ‌ర్ న‌టుడు విక్టరీ వెంకటేష్ – మీనా ప్రధాన పాత్రల్లో నటించి ఎన్నో సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువు అయిన సినిమా దృశ్యం. మ‌ళ‌యాళంలో హిట్ అయిన దృశ్యం సినిమాకు సీక్వెల్‌గానే దృశ్యం వ‌చ్చింది. ఇప్పుడు దృశ్యం 2 సినిమా కూడా అక్క‌డ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో అదే సినిమాను ఇక్క‌డ రీమేక్ చేశారు. జీతు జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా నేరుగా అమోజాన్ ఫ్రైమ్‌లో గ‌త అర్ధ‌రాత్రి రిలీజ్ అయ్యింది. మ‌రి ఈ సినిమా అంచానాల‌ను అందుకుందో ? లేదో TL స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ‌:
దృశ్యం సినిమా ఎక్క‌డ అయితే ముగిసిందో అక్క‌డ నుంచే దృశ్యం 2 క‌థ స్టార్ట్ అవుతుంది. రాంబాబు (వెంక‌టేష్‌), వ‌రుణ్ ( న‌దియా కొడుకు) మృత‌దేహాన్ని పోలీస్ స్టేష‌న్ కిందే పూడ్చేసి ఎలాంటి ఆధారాలే లేకుండా చేస్తాడు. ఇలా కాల‌క్ర‌మంలో ఆరు సంవ‌త్స‌రాలు గ‌డుస్తాయి. అస‌లు వ‌రుణ్ త‌ల్లి దండ్రులు త‌మ కుమారుడిని ఎవ‌రు చంపారో తెలియ‌క‌పోవ‌డంతో బ‌త‌క‌లేక బ‌తుకుతూ ఉంటారు. ఈ కేసులో రాంబాబుకు వ్య‌తిరేకంగా మ‌రిన్ని సాక్ష్యాలు సేక‌రించేందుకు పోలీస్ ఆఫీస‌ర్ (సంప‌త్‌ను) నియ‌మిస్తారు ? సంప‌త్ రాంబాబును అరెస్టు చేయ‌డానికి ఏం చేశాడు ? మరోసారి రాంబాబు ఈ పోలీసుల నుంచి త‌న కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ :
సినిమా తొలి భాగంలో వెంకీ క్యారెక్ట‌ర్‌ను ఎలా ఎలివేట్ చేశారో ఇక్క‌డ కూడా అలాగే చేశారు. చాలా వ‌ర‌కు త‌న క‌ళ్ల‌తోనే అద్భుత‌మైన ఎక్స్‌ప్రెష‌న్స్‌తో పాటు ఎమోష‌న్ల‌ను కూడా క్యారీ అయ్యేలా చేశాడు. మీనాకు ఈ సారి ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరికింది. న‌రేష్‌, న‌దియాతో పాటు ర‌ఫ్ కాప్‌గా సంప‌త్ రాజ్ బాగా న‌టించారు. ఇన్వెస్ట్‌గేటివ్ ఆఫీస‌ర్ ఎంత ర‌ఫ్‌గా ఉంటాడో ఈ సినిమాలో సంప‌త్ కూడా అలాగే క‌నిపించాడు. వెంకీ కుమార్తెలుగా న‌టించిన వారు కూడా పాత్ర‌ల వ‌ర‌కు బాగానే చేశారు. ఇక సెకండాఫ్‌లో యాక్ష‌న్ సీన్లు సినిమాకు మ‌రో హైలెట్‌. ఇక అన్నింటికంటే సినిమాలో ఎమోష‌న‌ల్ యాంగిల్ చాలా ఎక్కువుగా ఉండ‌డంతో పాటు బాగుంది. క్లైమాక్స్ జ‌స్టిఫికేష‌న్ బాగుంది. స్క్రీన్ ప్లేలో ట్విస్టుల‌ను రివీల్ చేసిన తీరు బాగుంది. ఇక సినిమా స్టార్టింగ్‌లో చాలా వ‌ర‌కు స్లో గా స్టార్ట్ అవ్వ‌డంతో పాటు కొంత సేపు స్లో మోడ్‌లో న‌డుస్తుంది. ఇలా కొంద‌రికి బోరింగ్ అనిపిస్తుంది. పాత్ర‌ల ప‌రిచ‌యానికే ఎక్కువ టైం తీసుకున్న‌ట్టు ఉంటుంది.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్‌:
టెక్నిక‌ల్‌గా చూస్తే అనిల్ జాన్స‌న్ మ్యూజిక్ మేజ‌ర్ హైలెట్‌. చాలా సీన్ల‌లో అత‌డు ఇచ్చిన నేప‌థ్య సంగీతం సినిమాను హైలెట్ చేసింది. స‌తీష్ కురూప్ సినిమాటోగ్ర‌ఫీ కూడా క్రైమ్‌, కాప్ సెట‌ప్‌తో పాటు క్లోజప్ షాట్లు బాగా చూపించాడు. నిర్మాత‌లు కూడా ఎక్క‌డా రాజీప‌డ‌కుండా ఖ‌ర్చు చేశారు.

జీతూ జోసెఫ్ డైరెక్ష‌న్ క‌ట్స్ :
ఇక ఓవ‌రాల్‌గా చూస్తే ద‌ర్శ‌కుడు జీతూ సీక్వెల్ చాలా బాగా చేశాడు. స‌మ‌కాలీన క్రైం, ఇన్వెస్ట్‌గేష‌న్ సీన్లు అల్లుకున్న విధానం బాగుంది. ఇన్వెస్ట్‌గేష‌న్‌ను డీటైల్డ్‌గా చూపించిన తీరు బాగుంది. కొన్ని సీన్లు వాస్త‌విక‌త‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్నాయి. ఇక అన్నింటికంటే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే చాలా ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఇంట‌ర్వెల్‌, క్లైమాక్స్ ట్విస్ట్‌లు అదిరిపోయాయి. వీటి కోస‌మే సినిమా త‌ప్ప‌కుండా చూడాలి.

ఫైన‌ల్‌గా…
దృశ్యం 2 ఖ‌చ్చితంగా అంచ‌నాల‌ను మించి అందుకుంది. అయితే ఫ‌స్ట్ పార్ట్‌తో పోలిస్తే థ్రిల్స్ సీక్వెన్స్ కాస్త మిస్ అయ్యాయి. వెంక‌టేష్ పాత్ర అమాయ‌కంగా ఉండ‌డంతో పాటు కొన్ని సీన్లు బాగా లేక‌పోవ‌డం, ఫ‌స్టాఫ్‌లో కొన్ని బోరింగ్ సీన్లు చిన్న చిన్న మైన‌స్‌లు. ఖ‌చ్చితంగా చూసి ఎంజాయ్ చేయొచ్చు.

TL దృశ్యం 2 రేటింగ్‌: 3 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news