Moviesఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెంచేసిన రష్మిక..ఆ హీరో కోసం ఇంత తెగ్గించిందా..?

ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెంచేసిన రష్మిక..ఆ హీరో కోసం ఇంత తెగ్గించిందా..?

రష్మిక మందన .. ఈమె ఇప్పుడు నేష్నల్ క్రష్ గా మారిపోయింది. సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ కన్నడ సోయగం..బాలీవుడ్ లోను సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున పక్కన పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. తాను ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం పాప యమ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధిన అప్ డేట్స్ ఇస్తూ తన అభిమానులను ఉత్సాహ పరుస్తుంటుంది.

ఇక రీసెంట్ గా అమ్మడు చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఆమెను మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. తన పాస్‌పోర్ట్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడమే కాక.. క్యాప్షన్ కూడా ఇచ్చిందండోయ్. తన ఇన్‌స్టాగ్రామ్ లో పిక్స్ షేర్ చేస్తూ.. నేన్ము ఎక్కడికి వెళ్తున్నానో చెప్పుకోండి చూద్దాం? అంటూ అభిమానులను అడిగింది. “ఈసారి మీకు చాలా దూరంగా ఉంది, కానీ త్వరలో తిరిగి వస్తుంది.” అంటూ మళ్లీ తన సెల్ఫీని పోస్ట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు తాజా అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రష్మిక పెట్టిన పోస్ట్ అభిమానులలో క్యూరియాసిటీని పెంచేసింది.

కాగా కొందరు నెటిజన్స్ ఆమె అమెరికా వెళ్లింది అంటున్నారు. విజయ్ దేవరకొండను కలవడానికే అమెరికా వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. యుఎస్‌లో లైగర్ షూటింగ్‌లో బిజీగా ఉన్న దేవరకొండను కలవనుందని, అందుకోసమే అమండు అమెరికా వెళ్లిందని అంటున్నారు. మరోవైపు రష్మిక ‘లైగర్’ గెస్ట్ రోల్ లో కన్పించబోతోందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది ఎంత వరకు నిజం అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news