Moviesఆమీర్‌ ఖాన్‌ సంచలన నిర్ణయం..కేజీఎఫ్ 2 దర్శక నిర్మాతలకు క్షమాపణలు..!!

ఆమీర్‌ ఖాన్‌ సంచలన నిర్ణయం..కేజీఎఫ్ 2 దర్శక నిర్మాతలకు క్షమాపణలు..!!

ప్రముఖ బాలీవుడ్‌ సూపర్ స్టార్ అమీర్‌ ఖాన్ ..గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నపాత్రలు పోషిస్తూ.. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తూ.. బాలీవుడ్‌ లోనే కాకుండా సౌత్‌ లోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు హీరో అమీర్‌ ఖాన్‌. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న చిత్రం లాల్ సింగ్ చ‌ద్దా. ఈచిత్రంలో అక్కినేని హీరో నాగచైతన్య కీలక పాత్ర పోషించిన విష‌యం తెలిసిందే. క‌రీనా క‌పూర్ క‌థానాయిక‌. అద్వైత్‌ చందన్ ఈ చిత్రాన్ని గ‌త రెండేళ్లుగా తెర‌కెక్కిస్తున్నాడు. దేశంలోని ప‌లు ప్రాంతాల‌లో మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది.

ఆ మ‌ధ్య ‘లాల్‌సింగ్ చద్దా’ సినిమా చిత్రీకరణ తూర్పుగోదావరి గోదావరి జిల్లాలో కూడా జ‌రిగింది. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దేశవ్యాప్తంగా వందకుపైగా లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు. వాటిలో తెలుగు రాష్రాల్లోని కాకినాడ, అమలాపురం, హైదరాబాద్‌ లొకేషన్లు కూడా ఉన్నాయి. 170 రోజులు షూటింగ్‌ జరిపారు. ఆస్కార్‌ విన్నింగ్‌ ఫిల్మ్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌’కు హిందీ రీమేక్‌గా రపొందిన ‘లాల్‌సింగ్‌ చద్దా’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

అయితే ఈ తేదీన నే మరో పాన్‌ ఇండియా సినిమా ‘కేజీఎఫ్‌’ 2 కూడా విడుదల కానుంది. కాగా ఇలా విడుదల రెండు సినిమాల విడుదల తేదీలు క్లాష్‌ అవ్వడంపై అమీర్‌ ఖాన్ స్పందించారు. రెండు భారీ సినిమాలు ఒకే య్తేదీన విడుదల కావడం వల్ల చిత్ర నిర్మాతలకు నష్టం కలుగుతుందని భావిస్తున్నా అంటూ ‘కేజీఎఫ్‌’ 2 దర్శక నిర్మాతలకు క్షమాపణలు చెప్పారు. వేరే నిర్మాత ఫిక్స్‌ చేసుకున్న రిలీజ్‌ డేట్‌లో ఎప్పుడూ నా సినిమాను విడుదల చేయాలి అనుకోలేదు. కానీ ఈసారి మాత్రం తప్పడం లేదు అంటూ చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news