Moviesఆ షో పై తమన్నా కన్నేర్ర.. లీగల్ యాక్షన్ కు సిద్ధం..అసలు...

ఆ షో పై తమన్నా కన్నేర్ర.. లీగల్ యాక్షన్ కు సిద్ధం..అసలు ఏం జరిగిందంటే?

తమన్నా వచ్చిన ఏ చిన్న అవకాశం వదలకుండా..అని సినిమాలు చేస్తూ వస్తుంది. రీసెంట్ గా అమె నటించిన సీటిమార్ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాచో హీరో గోపిచంద్, తమన్నా జంటగా.. సంపత్ నంది డైరెక్ట్ చేసిన స్పోర్ట్స్ బ్యాక్‌‌డ్రాప్ మూవీ ‘సీటీమార్’ వినాయక చవితి నాడు థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యి.. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు భారీ కలెక్షన్లతో పాటు గోపిచంద్‌కి మంచి కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో తమన్న నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి.

ఇక రీసెంట్ గా బుల్లితెర పై మాస్ట‌ర్ చెఫ్ అనే తెలుగు కార్య‌క్ర‌మానికి త‌మ‌న్నా హోస్ట్‌గా చేసిన సంగతి తెలిసిందే. హీరోయిన్‌గా ఆమెకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకున్న నిర్వాహ‌కులు భారీ రెమ్యున‌రేష‌న్‌ను చెల్లించారు. అయితే ఐపీఎల్‌, బిగ్‌బాస్ సీజ‌న్ 5 , ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు వంటి కార్య‌క్ర‌మాల మధ్యలో త‌మ‌న్నా హోస్ట్ చేస్తున్న మాస్ట‌ర్ చెఫ్‌ అట్టర్ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో త‌మ‌న్నా స్థానంలో జ‌బ‌ర్‌ద‌స్త్‌తో హాట్ బ్యూటీ యాంక‌ర్‌ అన‌సూయ ను హోస్టింగ్ చేయిస్తున్నారు.

అయితే ఇక దీని పై తమన్నా చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ విషయంపై తమన్నా లీగల్ ప్రొసీడ్ అవ్వడానికి సిద్దమైందట. నిజానికి ఈ షో కోసం తమన్నా వేరే కమిట్మెంట్ ను కాదనుకున్ని ఈ షో చేసిందట కానీ.. తీరా చూస్తే ‘మాస్టర్ చెఫ్’ నిర్వాహకులు తనకు చెప్పిన పేమెంట్ ఇవ్వకపోవడం కాదు కదా అన్ ప్రొఫెషనల్ గా మాట్లాడడం.. ప్రవర్తించడంతో లీగల్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించుకుందట. మరి దీనిపై ‘మాస్టర్ చెఫ్’ నిర్వాహకులు ఎలా స్పందిస్తారో చూడాలి!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news