Moviesఆ క్రేజీ బ్యూటీ పై కన్నేసిన ఎన్టీఆర్ - కొరటాల ..?

ఆ క్రేజీ బ్యూటీ పై కన్నేసిన ఎన్టీఆర్ – కొరటాల ..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్..ఓ వైపు సినిమాలు..మరో వైపు మీలో ఎవరు కోటీశ్వరులు షో ను చక్కగా బ్యాలన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. మరి కొద్ది రోజుల్లో ఈ షో ఫస్ట్ సిజన్ అయ్యిపోతుందని అంటున్నారు. ఇప్పటికే తారక్ తో సీజన్ వన్ కి కావాల్సిన అన్నీ ఎపిసోడ్స్ ని ఫినిష్ చేసారట. అయితే ఈ ఎవరు మీలో కోటీశ్వరుడి షో సెకండ్ సీజన్ కి హోస్ట్ గా ఆయన ఉండారు అనే టాక్ అయితే ఫిలిం ఇండస్ట్రీలో వినిపిస్తుంది.

ఇక యం టైగర్ సినిమాల విషయానికి వస్తే.. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్(RRR) అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే.సుమారు మూడేళ్ల పాటు ఈ సినిమాతో బిజీగా ఉన్న తారక్..త్వ‌ర‌లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తో చేయాల్సిన ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఆర్ఆర్ఆర్(RRR) కోసం బరువు పెరిగిన తారక్..కొరటాల శివ సినిమా కోసం బరువు తగ్గుతున్నాడట. ఈ సినిమాలో యం లుక్ లో కనిపించడం కోసం తారక్ తన బాడీ లో చాల మార్పులను చేసుకుంటున్నాడట.

ఇక ఈ సినిమా డిసెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్తుందని మేకర్స్ అంటున్నారు. ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి దీన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రూపొందించనున్నారు.కొరటాల సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ని సంప్రదించారని వార్తలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news