Moviesబిగ్ న్యూస్‌: వెంక‌టేష్ సినిమాలో అల్లు అర్జున్‌

బిగ్ న్యూస్‌: వెంక‌టేష్ సినిమాలో అల్లు అర్జున్‌

ఇదో బిగ్ న్యూస్ వెంక‌టేష్ సినిమాలో అల్లు అర్జున్‌.. ఇదేంటని కాస్త షాక్ అవుతున్నారా ? అస‌లు విష‌యం తెలుసుకుందాం. వెంక‌టేష్ – వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్లో వ‌చ్చిన ఎఫ్ 2 సినిమా ఎంత బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యిందో చూశాం. ఇప్పుడు ఈ సినిమాకు కంటిన్యూగా ఎఫ్ 3 సినిమా వ‌స్తోంది. వెంక‌టేష్ , వ‌రుణ్‌తేజ్ మ‌రోసారి జంట‌గా న‌టిస్తున్నారు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

అయితే స‌డెన్‌గా ఈ సినిమా సెట్స్‌లోకి పుష్ప రాజ్ ఎంట్రీ ఇవ్వ‌డంతో అక్క‌డ ఉన్న వారంతా ఒక్క‌సారిగా స‌ర్‌ఫ్రైజ్‌కు గుర‌య్యారు. ఎఫ్ 3 సెట్స్లోకి వెళ్లిను పుష్ప రాజ్ సీనియ‌ర్ హీరో వెంక‌టేష్‌తో పాటు వ‌రుణ్‌తేజ్‌, న‌ట‌కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్‌తో కాసేపు ముచ్చ‌టించారు. సినిమా విశేషాలు అడిగి తెలుసుకున్నారు.

ఆ త‌ర్వాత ఎఫ్ 3 ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడితోనూ చ‌ర్చించారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా త‌మ‌న్నా, మెహ్రీన్ న‌టిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ ఇస్తుండ‌గా.. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news