Moviesకార్తీక దీపం సీరియల్ హిమ,శౌర్య రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే.. నోట మాట...

కార్తీక దీపం సీరియల్ హిమ,శౌర్య రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే.. నోట మాట రాద్దంతే..!!

కార్తీకదీపం.. బుల్లితెరలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సీరియల్. ఈ సీరియల్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటు వస్తుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్ వచ్చినా, తుఫాన్‌లు వచ్చినా.. భూకంపాలు వచ్చినా వంటలక్క హవా మాత్రం తగ్గటం లేదు. కరోనా సీజన్ లోనూ ఆమె తన టీఆర్పీతో దుమ్మురేపుతోంది. ముఖ్యంగా బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధిస్తున్న సీరియల్ ఏదైనా ఉంది అంటే , అది కేవలం కార్తీకదీపం సీరియల్ మాత్రమే అని చెప్పవచ్చు.

ఆ సీరియల్‌తో తన చిరునవ్వుతోనూ తన అభినయంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసింది ప్రేమీ విశ్వనాథ్. ఇక ఈ సీరియల్ కార్తీకదీపం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు నిరుపమ్‌. అదేనండి మన డాక్టర్ బాబు. ఇందులో డాక్టర్ బాబు, వంటలక్క అంటే ఇష్టపడే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. ఇక ఈ సీరియల్ వీళ్లకు ఇద్దరు పిల్లలు .. హిమ..శౌర్య. విడిపోయిన తమ తలిదండ్రులను కలపాలని..సౌర్య , హిమ చేసే ఆలోచన చాలా మందిని అట్రాక్ట్ చేస్తున్నాయి.

అయితే, ఇప్పటివరకు జరిగిన కథ ఒక ఎత్తు అయితే..ఇప్పుడు జరగబోతున్న కథ ఎంతో ఇంట్రెస్టింగా నిలిచింది. హిమ, సౌర్య పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి .వయసు చిన్నదైనా వాళ్ళు మాట్లాడె పెద్ద పెద్ద మాటలు ఇంట్లోని పెద్ద వాళ్లను కూడా బాగా ఆకట్టుకోవడం గమనార్హం. అయితే ఈ సీరియల్ కి గాను హిమ-శౌర్య ఎంత పారితోషకం తీసుకుంటున్నారో తెలుసా..?? రోజుకు అక్షరాల 10 వేల రూపాయలను అందుకుంటున్నారట. నిజానికి వేరే సీరియల్ లోని నటించే పిల్లలు ఇంత పారితోషకం ఇవ్వరు. కానీ ఇక్కడ ఈ సీరియల్ లో పిల్లల పాత్రలు చాలా ఇంపార్టేంట్ పైగా సీరియల్ లో కూడా హైలెట్ గా నిలిచాయి.. అందుకే ఈ రేంజ్ పారితోషకం ఇస్తున్నారట. ఈ విషయం సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో ఇది కాస్త చాలా నెట్టింట వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news