Moviesవారెవ్వా..డార్లింగ్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే న్యూస్.. !!

వారెవ్వా..డార్లింగ్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే న్యూస్.. !!

బాహుబలి సినిమాతో ఇండియా లెవల్ లో భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ప్రభాస్.. మంచి జోరు మీదున్నాడు. పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక దీంతో పాటు ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ మూవీ కూడా చేస్తున్నారు.

ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుండగా.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతికతో తెరకెక్కించాల్సిన సినిమా కావడంతో ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోనే ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు డైరెక్తర్. అయితే తాజాగా అభిమానులకు ఈ సినిమా యూనిట్ మంచి అవకాశం ఇచ్చింది.

లోకల్ టాలెంట్ నే కాకుండా ఇండియా వైడ్ గా ఉన్న ఔత్సాహికుల‌ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఫేసెస్ ఆఫ్ ఫ్యూచర్ పేరుతో ఈ సినిమాలో నటించేందుకు కొత్త నటీనటులను ఆహ్వానిస్తున్నామని చిత్రబృందం ఓ ప్రకటన విడుదల చేసింది. గ‌తంలో ప‌లు ఆడిష‌న్స్ నిర్వ‌హించిన మేక‌ర్స్ ఇప్పుడు బెంగళూరు, చెన్నై, కొచ్చిన్, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఆడిషన్స్ పెడుతున్నట్టుగా తెలిపారు. నటుడు, మోడల్స్, డాన్సర్స్, మార్షల్ ఆర్టిస్ట్స్ ఇలా టాలెంట్ ఉన్న ఎవరైనా సరే ఆడిషన్స్ లో పాల్గొనడానికి తమకు మెయిల్ చేయాలని పేర్కోన్నారు. మ‌హాన‌టి చిత్రం త‌ర్వాత నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

 

 

 

 

View this post on Instagram

 

A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news