Gossipsఅభిమానుల కోసం నాగార్జున బిగ్ సర్ప్రైజ్..వామ్మో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా..??

అభిమానుల కోసం నాగార్జున బిగ్ సర్ప్రైజ్..వామ్మో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా..??

అక్కినేని నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ మూవీకి సీక్వెల్ గా ‘బంగార్రాజు’ అనే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో స్పెషల్ సెట్ వేసి షూటింగ్ ను చేస్తున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ మూవీలో ఒక క్యారెక్టర్ పేరు బంగార్రాజు..ఆ మూవీకి ఆ క్యారెక్టరే హైలెట్ కావడంతో ఎంతో మంచి పేరు వచ్చింది.

అందుకే ఈ సినిమాకు అదే పేరు ‘బంగార్రాజు’అని ఫిక్స్ చేశారు. ఈ మూవీలో నాగార్జున, నాగ చైతన్య కలసి నటించబోతున్నారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగ చైతన్య సరసన కృతి శెట్టి ఈ సినిమాల్లో ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. దీంతో సినిమా పై భారి అంచనాలు పెట్టుకున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ వార్త అభిమానుల్లో నూతన ఉత్సాహం నింపుతుంది.

ఈ సినిమాలో అక్కినేని వారసుడు అఖిల్ సైతం నటిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. ఈ సినిమాలో నాగార్జున, నాగ చైతన్య కలిసి సినిమాలో అఖిల్ స్టెప్పులు వేయనున్నడట. అయితే అది కేవలం ఓ కేమియో పాత్ర మాత్రమేనని..స్టోరీని మలుపు తిప్పే కీలక సమయంలో అఖిల్ స్పెషల్ ఎంట్రీ ఉంటుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. మరి చూడాలి ముగ్గురు అక్కినేని వారసులు ఎలా తెర పై కనువిందు చేయనున్నారో..??

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news