Moviesవామ్మో.. "పుష్ప" సినిమాలో ఆ ఒక్క సీన్ కోసం అన్ని కోట్లు...

వామ్మో.. “పుష్ప” సినిమాలో ఆ ఒక్క సీన్ కోసం అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారా..??

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సంక్రాంతికి వ‌చ్చిన అల వైకుంఠ‌పురంలో సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో బ‌న్నీ క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పుడు బ‌న్నీ సౌత్ ఇండియా సూప‌ర్ స్టార్‌గా మారిపోయాడు. గ‌త బ్లాక్ బ‌స్ట‌ర్ అల వైకుంఠపురంలో త‌ర్వాత ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఇటు సుక్కు కూడా రంగ‌స్థ‌లం లాంటి యునాన‌మ‌స్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని పుష్ప మీదే వ‌ర్క్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో ఫస్ట్ టైం బన్నీ పక్కన రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే..ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా పుష్ప‌లో ర‌ష్మీక గిరిజ‌న అమ్మాయిగా క‌నిపిస్తుండ‌గా… బ‌న్నీ కూడా ఆమెను ప్రేమించే గిరిజ‌న యువ‌కుడి గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. త‌మిళ‌నాడు, చిత్తూరు స‌రిహ‌ద్దుల్లోని ఓ గిరిజ‌న గ్రామానికి సంబంధించిన క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. అసలు లాక్ డౌన్ లేక‌పోతే.. ఈపాటికి సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి..రిలీజ్ కు సిద్ధంగా ఉండేది. కానీ కరోనా మహమారితో లెక్కలని మారిపోయాయి.

ఇందులో బ‌న్నీ ఓ లారీ డ్రైవ‌ర్ గాన‌టించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విశేషాలు ఒక్క‌టి లీక్ అయ్యింది. ఎర్ర చందనం స్మ‌గ్లింగ్ సాగే సీన్ లో బ‌న్నీ ఓ లారీ ఛేజింగులు సీన్ సినిమాకే హైలెట్ గా నిలవనుందట. ముందు బ‌న్నీ లారీ, వెనుక బోలెడ‌న్ని పోలీసు వ్యాన్లతో భారీ ఛేజింగు సీన్ ని చూస్తే..హాలీవుడ్ స్థాయిలో తెర‌కెక్కించారని అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఇక ఈ సీన్ తరువాతే ఈ సినిమా అసలు సిసలు యాక్ష‌న్ సీన్స్ ఉంటాయని.. దాదాపు ఆరు నిమిషాల పాటు సాగే ఈ యాక్ష‌న్ సీన్స్ కోసం ఏకంగా ఆరు కోట్లు ఖ‌ర్చు పెట్టారని ఫిల్మ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news