Moviesదిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్: ఎలిమినేట్ అయిన కంటెస్టేంట్...

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్: ఎలిమినేట్ అయిన కంటెస్టేంట్ ఎవరో తెలుసా..?

తెలుగు ప్రేక్షకులందరు ఎంతగానో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమైంది. భారీ అంచనాల నడుమ స్టార్ట్ అయినా ఈ షో నెం 1 టీఆర్పి రేటింగ్ లతో దూసుకుపోతుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలై రెండు వారాలు ముగిసింది. తోటల్ 19 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్‏బాస్ హౌస్ లో ..మొదటి వారం సరయు ఎలిమినేట్ అయ్యిపోయింది.

కంటెస్టెంట్స్.. హౌస్‌లో రెచ్చిపోయి కావాల్సినంత వినోదం పంచుతున్నారు. గత సీజన్స్‌లానే ఇంటిసభ్యుల మధ్య గొడవలు, అరుపులు, గోలలు. ఏడుపులు, నవ్వులు ఇలా సందడిగా బిగ్ బాస్ తెలుగు ఆసక్తికరంగా సాగుతుంది. హౌస్‌లో ఉన్నవారంతా ఎక్కువ రోజులు ఉండాలని విపరీతంగా ట్రై చేస్తున్నారు. అయితే రెండో వారం ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అయితే సోషల్ మీడియాలో ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టేంట్ ఈమె అంటూ ప‌లు వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, ఇందులో ఏది నిజం ఏది అబ‌ద్ధం అనేది తెలియ‌డం లేదు. అయితే తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ఈ వారం నుండి హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యింది కార్తీక దీపం ఫేం ఉమదేవి అని తెలుస్తుంది.

తొలి నుంచి చాలా అగ్రిసివ్‌గా ఉన్న ఉమ.. నామినేషన్స్ సందర్భంగా తిట్టిన బూతు చాలామందికి ఇబ్బందిగా అనిపించింది. అయితే ఆ తరవాత ఆమెను బిగ్ బాస్ ఫుల్ స్క్రీన్ స్పేస్ ఇచ్చిన అది వర్క్ అవుట్ కాలేదు. పోల్ ప్రకారం చూస్తే ఉమాదేవి ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news