Newsబిగ్ షాకింగ్ : బిగ్ బాస్ విన్నర్ కన్నుమూత..శోకశంద్రంలో అభిమానులు..!!

బిగ్ షాకింగ్ : బిగ్ బాస్ విన్నర్ కన్నుమూత..శోకశంద్రంలో అభిమానులు..!!

ప్రముఖ టెలివిజన్ మరియు సినీ నటుడు సిద్ధార్థ్ శుక్లా (40) కన్నుమూశారు. ప్రముఖ నటుడు, బిగ్ బాస్ సీజన్ 13 విజేత సిద్ధార్థ్ శుక్ల గుండెపోటుతో మరణించారు. 40 ఏళ్ళకే ఈయన హఠాన్మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. హార్ట్ ఎటాక్ తీవ్రంగా రావడం వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన్నట్లు తెలుస్తుంది. ఈ టాలెంటెడ్ నటుడు గురువారం గుండెపోటుతో మరణించినట్లు ఓ ప్రైవేట్ ఆసుపత్రి అధికారి తెలిపారు.

ఈరోజు ఉదయమే గుండెపోటు రావడంతో ఆయనకు ఆసుపత్రిలో చేర్పించారని, గుండెపోటు తీవ్రంగా ఉండడంతో ఆయన కన్నుమూసినట్టు సమాచారం. శుక్లా తన కెరీర్‌ని మోడల్‌గా షోబిజ్‌లో ప్రారంభించి..సుదీర్ఘకాలం పాటు టెలివిజన్ లో ప్రసారమైన టీవీ సీరియల్ “బాలికా వధూ”లో సిద్ధార్థ్ ప్రధాన పాత్ర పోషించారు. టెలివిజన్ షో “బాబుల్ కా ఆంగన్ చూటే నా” లో ప్రధాన పాత్ర చేశాడు. . ఝలక్ దిఖ్లా జా 6, బిగ్​బాస్ 13షోలో పాల్గొని మరింత ఫేమ్ సంపాదించారు.

కరణ్ జోహర్ నిర్మించిన ‘హంప్టీ శర్మా కీ దుల్హానియా’ చిత్రంలో సహాయ నటుడి పాత్రలో మెరిశారు. బిగ్ బాస్ 13 విన్నర్ తరువాత ఆయన క్రేజ్ అమాంత మరింత పెరిగింపోయింది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో స్టార్ డమ్ ను ఎదుర్కొంటున్న ఈ యంగ్ యాక్టర్ అప్పుడే తిరిగిరాని లోకాలకు వెళ్లడం అందరికీ షాక్ ఇస్తోంది. ఆయన మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news