Moviesఈ హీరోయిన్ మెడపై ఉన్న పేరు ఎవరిది.. ఆ సీక్రెట్ ఇదే...

ఈ హీరోయిన్ మెడపై ఉన్న పేరు ఎవరిది.. ఆ సీక్రెట్ ఇదే ?

సంజ‌న గ‌ల్రానీ చేసిన సినిమాలు త‌క్కువ‌… కాంట్ర‌వ‌ర్సీలు ఎక్కువ‌. శాండ‌ల్ వుడ్ డ్ర‌గ్స్ ఇష్యూలో సంజ‌న పేరు ఎలా ? మార్మోగిందే తెలిసిందే. చివ‌ర‌కు ఆమె జైలులో కూడా ఉండి వ‌చ్చింది. తెలుగులో కూడా అడ‌పా ద‌డ‌పా సినిమాలు చేసినా ఇక్క‌డ కూడా ఆమెకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. సంజ‌న బెంగ‌ళూరుకు చెందిన డాక్ట‌ర్ అజీన్‌ను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. అజీజ్ ను సీక్రెట్‌గా పెళ్లాడిన ఆమె త‌న భ‌ర్త అంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని చెపుతోంది.

15 ఏళ్లుగా అజీజ్ తో తన ప్రయాణం సాగుతోందన్న ఆమె కెరీర్ స్టార్టింగ్ నుంచే అత‌డితో ప‌రిచ‌యం, ప్రేమ ఉంద‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పింది. త‌న సోష‌ల్ మీడియాలో అజీజ్‌ను కీర్తించేసింది. త‌న‌పై ఎన్నో పుకార్లు వ‌చ్చాయ‌ని.. సోద‌రుడి వ‌రుస‌య్యే వ్య‌క్తితో పాటు ఓ క్రికెట‌ర్‌, ఓ రాజ‌కీయ నేత‌, ఓ సినిమా స్టార్‌తో కూడా ఎఫైర్లు ఉన్నాయ‌ని రాసేశార‌ని వాపోయింది. ఎన్ని పుకార్లు వ‌చ్చినా నిజ‌మైన ప్రేమ ఎప్ప‌ట‌కి నిల‌బ‌డుతుంద‌ని సంజ‌న చెప్పింది. ఈ ప్రేమ త‌న‌కు అజీజ్ రూపంలో దొరికింద‌ని కూడా ఆమె సంతోషం వ్య‌క్తం చేసింది.

ఈ క్ర‌మంలోనే అజీజ్ పేరును ఆమె మెడ వెన‌క భాగంలో ప‌చ్చ‌బ‌ట్టు పొడిపించుకుంది. ఈ ఫొటో కూడా ఆమె షేర్ చేసింది. 15 ఏళ్ల ప‌రిచ‌యంలో అజీజ్ ఓ మార్గ‌ద‌ర్శి, ల‌వ‌ర్‌, భ‌ర్త‌గా ఎప్పుడూ త‌న వెంటే క‌ష్ట‌సుఖాల్లో ఉన్నాడ‌ని చెప్పింది. ఇక సంజ‌న గ‌ల్రానీ సోద‌రి నిఖ్కీ గ‌ల్రానీ సైతం సినిమాల్లో మెరిసిన సంగ‌తి తెలిసిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news